సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
ABN , First Publish Date - 2021-02-07T03:13:23+05:30 IST
వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల మేరకు రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని భీమ్‌గల్ డివిజన్ ఏడీఏ మల్లయ్య సూచించారు.

వేల్పూర్, ఫిబ్రవరి6: వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల మేరకు రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని భీమ్‌గల్ డివిజన్ ఏడీఏ మల్లయ్య సూచించారు. శనివారం వేల్పూర్‌లో రైతు వేదికలో రై తులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. నువ్వు పంటలో విత్తనశుద్ధి చేసుకోవాలన్నారు. వరి లో అగ్గితెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ 120గ్రాములు ఎకరానికి పిచికారి చేయాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా సభ్యుడు మహిపాల్, ఆత్మ కమిటీ చైర్మన్ నోముల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
మెండోర : రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ డె ౖరెక్టర్ నాగంపేట్ శేఖర్ అన్నారు. బుస్సాపూర్ రైతు వేదిక భవనంలో మండల వ్యవసాయాధికారి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో రైతు క్లస్టర్లతో స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొలాల్లో వచ్చే తెగుళ్లు, ఇతర చీడపీడల నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమం లో సర్పంచ్ సుజాత, గంగారెడ్డి, రైతు సమితి గ్రామ కో-ఆర్డినేటర్ భోజేం దర్, కమలాకర్, గోలిప్రకాష్ పాల్గొన్నారు.
పంటల వివరాలను నమోదు చేసుకోవాలి
ముప్కాల్: యాసంగిలో సాగు చేస్తున్న పంటల వివరాలను సర్వే నెంబర్‌తో సహా నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి రా జ్‌కుమార్ అన్నారు. శనివారం రెంజర్ల గ్రామంలో రైతు వేదిక భవనంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రైతు బంధు సమితి అధ్యక్షు డు ముత్తెన్న, వైస్‌ఎంపీపీ ఆకుల చిన్న రాజన్న పాల్గొన్నారు.