బీపీఎంపై పోలీసులకు ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-02-07T04:53:25+05:30 IST
పింఛన్ల పంపిణీలో బీపీఎం చేతివాటం ప్రద ర్శించడంతో ఓ వ్యక్తి అడ్డుకునేందుకు వెళ్లగా బీఎల్‌వో సయ్యద్ బీన్ ఎదు రు దాడి చేశాడు.

బాన్సువాడ, ఫిబ్రవరి 6: పింఛన్ల పంపిణీలో బీపీఎం చేతివాటం ప్రద ర్శించడంతో ఓ వ్యక్తి అడ్డుకునేందుకు వెళ్లగా బీఎల్‌వో సయ్యద్ బీన్ ఎదు రు దాడి చేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్ట ణంలోని పోస్టాఫీసులో బీపీఎంగా పని చేస్తున్న సయ్యద్ బీన్ 15వ వార్డులో పింఛన్లు పంపిణీ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.20 నుంచి రూ.50 వసూలు చేశారు. విషయం తెలుసు కున్న రాజు ప్రశ్నించగా ఎదురు దాడి చేసినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోస్టాఫీసు ఉన్నతాధికారి లక్ష్మణ్‌ను వివరణ కోరగా అతని పరిధిలోని సింగీతంలో డబ్బులు పంపిణీ చేయాలని, మిగతా చోట్ల పంచరాదని సమాధానం చెప్పారు.