రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-11-23T05:46:13+05:30 IST

సదాశివనగర్‌ మండలం లింగంపల్లి, జనగాం, తాడ్వాయి మండలం కరడ్‌పల్లి గ్రామ శివారులో పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణం కోసం చేపడుతున్న రోడ్డు పనులను సోమవారం కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ పరిశీలించారు.

రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్‌


సదాశివనగర్‌/తాడ్వాయి, నవంబరు 22:
సదాశివనగర్‌ మండలం లింగంపల్లి, జనగాం, తాడ్వాయి మండలం కరడ్‌పల్లి గ్రామ శివారులో పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణం కోసం చేపడుతున్న రోడ్డు పనులను సోమవారం కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ పరిశీలించారు. పరిశ్రమ ఏర్పాటుచేసే స్థలంలో జనగామ గ్రామానికి చెందిన పల్లె ప్రకృతివనం, డంపింగ్‌ యార్డు, లింగంపల్లి కోతుల ఆహార కేంద్రం స్థలాలు ఉన్నాయని ఆయా గ్రామాల సర్పంచ్‌లు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. స్థలాలు పరిశ్రమలోకి వెళ్లకుండా చూడాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. పరిశ్రమ ఏర్పాటుతో పట్టా భూ ములు పోయాయని తెలుపడంతో మరోచోట వారికి భూములను చూపించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రోడ్లు, కల్వర్టులు, అంతర్గత రోడ్ల నిర్మాణం చేపడతామని రాష్ట్ర ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ శివకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌డీవో శ్రీనునాయక్‌, తహసీల్దార్‌ వెంకట్‌రావు, ఆర్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి అధికారులు పాల్గొన్నారు.
డయాలసిస్‌ హబ్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన
కామారెడ్డి: జిల్లా కేంద్రంలో డయాలసిస్‌ హబ్‌ ఏర్పాటుకు అనువైన స్థలాలను సోమవారం కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, డీఎంహె చ్‌వో కల్పన కంటే పరిశీలించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్నేహపూరి కాలనీ, రాజీవ్‌ గృహకల్ప వద్ద ఉన్న స్థలాలను పరిశీలించారు. ఏ స్థలం అనువుగా ఉంటుందో పరిశీలించాలని కోరారు. ఆయనతో పాటు తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌, ఆర్‌ఐ నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన
మాచారెడ్డి, : మండలంలోని లచ్చపేట శివారులో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు సోమవారం కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ డిప్యుటీ జనరల్‌ మేనేజర్‌ రామదాసు, ప్రాజెక్ట్‌ ఇంజనీరు శివకృష్ణ, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-23T05:46:13+05:30 IST