చిట్టాపూర్‌కు నిధులు మంజూరు చేయాలి

ABN , First Publish Date - 2021-07-09T05:18:27+05:30 IST

మండలంలోని చిట్టాపూర్‌ గ్రామానికి నాలుగో విడ త పల్లెప్రగతి నిర్వహణ కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ చి ట్టాపూర్‌ గ్రామస్థులు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాక ర్‌రావు, గృహ నిర్మాణ, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని గురువారం కలిశారు.

చిట్టాపూర్‌కు నిధులు మంజూరు చేయాలి


బాల్కొండ, జూలై8: మండలంలోని చిట్టాపూర్‌ గ్రామానికి నాలుగో విడ త పల్లెప్రగతి నిర్వహణ కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ చి ట్టాపూర్‌ గ్రామస్థులు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాక ర్‌రావు, గృహ నిర్మాణ, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని గురువారం కలిశారు. పల్లె ప్రగతి పనుల పరిశీలన, వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు మంత్రులు గురువారం రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో పర్యాటన రద్దయింది. విషయం తెలుసుకున్న చిట్టాపూర్‌ గ్రామ స్థులు సర్పంచ్‌ వనజతో కలిసి వేల్పూర్‌లో మంత్రుకు సమస్యను విన్నవిం చారు. నూతన గ్రామపంచాయతీ భవనం, జాతీయరహదారి నుంచి ఉన్నత పాఠశాల వరకు డబుల్‌రోడ్డు, కిలోమీటర్‌ మేర సీసీరోడ్డు, మహిళా భవనం మంజూరు చేయాలని విన్నవించగాపని చేసి పెడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వనజగోవర్ధన్‌, ఎంపీటీసీ కవిత శ్యామ్‌, ప్రజాప్రతినిధులు, రాజేందర్‌, వీరన్న, రాజన్న, గ్రామస్థులు ఉన్నారు.  

Updated Date - 2021-07-09T05:18:27+05:30 IST