బాలల సేవలకు బాల రక్షక్‌

ABN , First Publish Date - 2021-12-30T05:35:13+05:30 IST

జిల్లాలోని బాలలకు సత్వర సేవలు అందించేందుకు బాల రక్షక్‌ వాహనం అందుబాటులోకి వచ్చిందని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలో బాల రక్షక్‌ వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

బాలల సేవలకు బాల రక్షక్‌

పిల్లల రక్షణకు 1098 హెల్ప్‌లైన్‌  నెంబర్‌ 

కలెక్టర్‌ నారాయణరెడ్డి 

నిజామాబాద్‌అర్బన్‌, డిసెంబరు 29: జిల్లాలోని బాలలకు సత్వర సేవలు అందించేందుకు బాల రక్షక్‌ వాహనం అందుబాటులోకి వచ్చిందని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలో బాల రక్షక్‌ వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆపదలో ఉన్న పిల్లలను త్వరగా కాపాడడానికి ప్రభుత్వం బాలరక్ష వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నవంబరు 14న రాష్ట్రం మొత్తంలో 33 వాహనాలను సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా అన్ని జిల్లాలకు కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే జిల్లాకు ఒక వాహనాన్ని కేటాయించడం జరిగిందని తెలిపారు. పిల్లలు ఎక్కడ కనబడిపా హెల్ప్‌లైన్‌ 1098 నెంబర్‌కు ఫోన్‌చేస్తే ఈ వాహనంలో సంబంధిత అధికారులు వచ్చి పిల్లల రక్షణ, సంరక్షణ చూసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లా సంక్షేమ అధికారి ఝాన్సీలక్ష్మి, చైతన్య, ఐసీడీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-12-30T05:35:13+05:30 IST