విద్యా సంస్థల బస్సులు తనిఖీ
ABN , First Publish Date - 2021-08-26T05:05:21+05:30 IST
జిల్లాలో విద్యాసంస్థలు సెప్టెంబ రు 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుండడంతో జిల్లాలోని విద్యాసంస్థలకు చెందిన బస్సులను రవాణాశాఖ అధికారు లు తనిఖీ చేయనున్నట్లు జిల్లా రవాణ శాఖ అధికారిణి వాణి తెలిపారు.

కామారెడ్డి, ఆగస్టు 25: జిల్లాలో విద్యాసంస్థలు సెప్టెంబ రు 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుండడంతో జిల్లాలోని విద్యాసంస్థలకు చెందిన బస్సులను రవాణాశాఖ అధికారు లు తనిఖీ చేయనున్నట్లు జిల్లా రవాణ శాఖ అధికారిణి వాణి తెలిపారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అన్ని విద్యా సంస్థలకు చెందిన ప్రతీ వాహనాన్ని క్షుణంగా తనిఖీ చే స్తామన్నారు. నిబంధనలకు అనుగుణంగా లేని బస్సులను సీజ్ చేస్తామని తెలిపారు. మోటర్ వాహన చట్టం ప్రకా రం వాహనం రిజిస్ట్రేషన్ సర్టిపికేట్, ఇన్సూరెన్సు, ఫిట్నేస్ సర్టిఫికేట్, ఫరిమిట్, పన్ను చెల్లింపు రశీద్, పోల్యూషన్ అండ్‌కంట్రోల్ సర్టిఫికేట్, డ్రైవర్లకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. డ్రైవర్లకు ఐదేళ్ల అనుభావం, 60ఏళ్ల వయ స్సు మించకుండా చూసుకోవాలన్నారు. కొవిడ్-19 నిబంధ నలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా సంస్థలకు చెందిన బస్సులు నిబందనలకు అనుగుణంగా నడిపించాలన్నారు. బస్సులో ప్రతీ విద్యార్థి మాస్క్ ధరించేలా చూడాలన్నారు.