కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలు

ABN , First Publish Date - 2021-12-19T06:56:28+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలుగా మారి ప్రజలను వంచించడమే తమ ధ్యే యంగా పని చేస్తున్నాయని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ధ్వజ మెత్తారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలు
పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు




మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి
‘జన జాగరణ’కు మద్దతుగా బోధన్‌లో కాంగ్రెస్‌ నేతల పాదయాత్ర

బోధన్‌ రూరల్‌, డిసెంబరు 18:  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలుగా మారి ప్రజలను వంచించడమే తమ ధ్యే యంగా పని చేస్తున్నాయని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ధ్వజ మెత్తారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం యూపీలో తలపెట్టిన జన జా గరణ యాత్రకు సంఘీభావంగా బోధన్‌ మండలంలో శనివా రం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మహాపాదయాత్ర చేపట్టారు. మండలంలోని సాలూర క్యాంపు గ్రామంలోని ఆంజనేయ స్వా మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. సాలూర క్యాంపు నుంచి బోధన్‌ వరకు పాదయాత్ర కొనసాగింది. సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన పాదయాత్రకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డారు. ప్రజా సంక్షేమం తమ ధ్యేయమంటూ అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను వంచించడంలో త మకు ఎవరూ సాటిలేరన్న విధంగా వ్యవహరిస్తున్నాయని వి మర్శించారు.  కేంద్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల ను మరిచిపోయిందన్నారు. వంట గ్యాస్‌ ధరలు పెంచుతూ సబ్సిడీ ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా ఇండస్ర్టీలు తెస్తా మని చెప్పి విభజించి పాలించే విధానం చేస్తున్నారని దుయ్యబట్టారు. విద్యార్థులు చదువుకోడానికి కళాశాలలు, స్కూ ల్‌లు నిర్మించలేని ఈ ప్రభుత్వాలు అధికారంలో కొనసాగడం దురదృష్టకరమన్నారు. బంగారు తెలంగాణ తమ ధ్యేయమం టూ సీఎం కేసీఆర్‌ మోచేతికి బెల్లం పెట్టారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులు పంటలు పండించేందుకు పుష్కలమైన సాగునీరు అందిస్తామ ని చెప్పి వరి పంటను సాగుచేయవద్దని చెప్పడం ఎంత వర కు సమంజసమని ప్రశ్నించారు. ఆసియా ఖండానికే తలమా నికంగా ఉన్న నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని మూసివేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ వైఖరి వల్ల అటు రైతులు, ఇటు కార్మికులు నష్టపోయారని గుర్తుచేశారు. ధాన్యం కేటాయింపు ల్లో అధికారులు ఒక్కో రైస్‌మిల్‌ నుంచి వేలాది రూపాయలు ముడుపులు తీసుకుని కేటాయింపులు జరపడం సిగ్గుచేటన్నారు. మూతపడిన రైస్‌మిల్లు, నిర్మాణంలో ఉన్న రైస్‌మిల్‌లకు  ధాన్యం కేటాయింపులు చేయడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌  పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, తప్పు చేసిన అధి కారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రా ష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూ ర్తిగా విఫలమైందన్నారు. రుణ మాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యో గ నోటిఫికేషన్లు చేపట్టకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ భజన పరులుగా మారారని, ప్రజా సమస్యలపై మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొ న్నారు. కుటుంబ అభివృద్ధి మినహా గ్రామాల్లో ఎక్కడ అభివృ ద్ధి ఛాయలు కనపడడం లేదన్నారు. క్రూడాయిల్‌ ధరలు తగ్గి నా కేంద్రం పెట్రోల్‌, డీజీల్‌ ధరలను తగ్గించకపోవ డం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, మా జీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు తా హెర్‌బీన్‌ హందాన్‌, మానాల మోహన్‌రెడ్డి, కాసుల బాల్‌రాజ్‌, గడుగు గంగాధర్‌, కేశ వేణు, ఎ.బి.శ్రీనివాస్‌, రామ్మోహన్‌, నాగ భూషణం, పాషా మొయినుద్దీన్‌, అబ్బాగోని గంగాధర్‌గౌడ్‌, గంగాశంకర్‌, అల్లె రమేష్‌, మందర్న రవి, ఖాజాపూర్‌ అశోక్‌, నాగేశ్వర్‌రావు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-19T06:56:28+05:30 IST