‘ఆర్మూర్‌ ఎమ్మెల్యేపై సీబీఐ విచారణ జరిపించాలి’

ABN , First Publish Date - 2021-07-24T06:18:34+05:30 IST

ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎంఆర్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు మైలారం బాలు శుక్రవారం ఎంపీ అర్వింద్‌కు వినతిపత్రం అందజేశారు.

‘ఆర్మూర్‌ ఎమ్మెల్యేపై సీబీఐ విచారణ జరిపించాలి’
ఎంపీకి వినతిపత్రం అందజేస్తున్న ఎంఆర్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు

నిజామాబాద్‌అర్బన్‌, పెర్కిట్‌, జూలైౖ 23: ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎంఆర్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు మైలారం బాలు శుక్రవారం ఎంపీ అర్వింద్‌కు వినతిపత్రం అందజేశారు. 2016లో ఆర్మూర్‌ పట్టణంలో ఇద్దరు వ్యక్తులను హత్య చేయించాడని, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి దళిత యువకుల హత్యకేసులో ప్రమేయం ఉన్న ఆర్మూర్‌ ఎమ్మెల్యేపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. దళి తబంధు పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందని, మరోసారి దళితులను మోసం చేసే రాజకీయ కుట్ర చేస్తున్నారన్నారు. 

Updated Date - 2021-07-24T06:18:34+05:30 IST