రేషన్‌ డీలర్‌పై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-05-22T04:29:00+05:30 IST

రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట గ్రామంలో రేషన్‌ షాపులో అక్రమాలకు పాల్పడుతున్న డీలర్‌పై కేసు నమోదు చేసినట్లు సివిల్‌ సప్లయి డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీకాంత్‌ తెలిపారు.

రేషన్‌ డీలర్‌పై కేసు నమోదు


రామారెడ్డి,మే21: రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట గ్రామంలో రేషన్‌ షాపులో అక్రమాలకు పాల్పడుతున్న డీలర్‌పై కేసు నమోదు చేసినట్లు సివిల్‌ సప్లయి డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీకాంత్‌ తెలిపారు.దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు నాణ్యమైన రూపాయికే కిలో బియ్యం ప్రభుత్వం అందజే స్తుంటే వారికి అందకుండా డీలర్లు అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న ఘటన రెడ్డిపేట గ్రామంలో చోటుచేసుకుంది.ప్రభుత్వం రేషన్‌ షాపుల్లో అవకతవకలు జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న డీలర్ల అక్కమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. రెడ్డిపేటలో బాల నాగయ్య  షాపు లో 3క్వింటాళ్ల 95 కిలోల బియ్యం నిల్వఉండగా అవి మాయం కావడంతో  శుక్రవారం తనిఖీ సమయంలో అవి లేకపోవడంతో డీలర్‌పై సెక్షన్‌ 6ఏ కింద కేసు నమోదు చేసినట్లు ఇన్‌చార్జి భట్టు భరత్‌పై రికవరీ వేసినట్లు తెలిపారు. ఈ తతంగం మొత్తం మంగళవారం జరిగిన రెవెన్యూ అధికారులు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Updated Date - 2021-05-22T04:29:00+05:30 IST