వద్దంటే.. వర్రీ

ABN , First Publish Date - 2021-10-29T05:43:17+05:30 IST

యాసంగిలో వరి సాగు వద్దని, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు పెట్టడడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది.

వద్దంటే.. వర్రీ


యాసంగిలో సాగు చేయొద్దంటున్న రాష్ట్ర ప్రభుత్వం
ఆందోళనలో జిల్లా అన్నదాతలు
ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయాధికారుల అవగాహన
విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌, అక్టోబరు 28: (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :
యాసంగిలో వరి సాగు వద్దని, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు పెట్టడడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. వానాకాలం పంట చేతికి రావడంతో రైతులు యాసంగికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో వరి సాగుచేస్తే రైతులకు ఇబ్బందులు తప్పవని, ఒక వేళ వరి వేసినా ధాన్యాన్ని కొనుగోలు చేయమంటూ ప్రభుత్వ ప్రకటనలకు తోడు సంబంధిత అధికారులూ చేస్తున్న సూచనలు కర్షకు లను కలవరపెడుతున్నాయి. ఇదిలా ఉండగా కొం దరు రైతులు ఆవైపు అడుగులు వేస్తున్నా.. మరి కొంత మంది రైతులు తమ భూములు వరి సాగుకే  అనుకూలంగా ఉ న్నాయని, ఇతర పంటలు వేస్తే నష్టాలు తప్ప వని వాపోతున్నారు.
ఈ సంవత్సరం భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెరువు లు, జలాశయాలలు కళకళలాడుతున్నాయి. భూగర్భ జలా లు సైతం పెరడంతో యాసంగిలో వరి సాగుకు ఢోకా లేదని భావించిన రైతుల ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు గుమ్మ రించింది. యాసంగిలో వరి వద్దని, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేసింది. సందుకు సంబంధించిన మార్గనిర్ధేశాలను వ్యవసాయాఽ దికారులకు సూచించింది. దీంతో సంబంధిత అధికారులు రైతులకు విరివిగా అవగాహన సదస్సులు ఏర్పాటు చే స్తున్నారు. ఏయే పంటలు వేస్తే ఎంత లాభం వస్తుందో వి వరించే ప్రయత్నం చేస్తున్నారు. విత్తనాలను కూడా అం దుబాటులో ఉంచుతున్నామని ప్రకటనలు చేస్తున్నారు.
మూడు దశాబ్దాలుగా వరిసాగు..
జిల్లాలోని రైతులు మూడు దశాబ్దాలుగా వానాకా లం, యాసంగి సీజన్లలో వరి సాగు చేస్తున్నారు. నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌, గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతల పథకాల ఆయకట్టుపరిధిలో ఈ వరిసాగును ఎక్కువగా చేస్తున్నారు. ప్రస్తుతం నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌తో పాటు చెరువుల్లో పూర్తిస్థాయిలో నీటి మట్టాలు ఉండడం వల్ల యాసంగిలోను వరిసాగుకే రైతులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. వరి కోతల్లో నిమగ్నమైన రైతులు పూర్తిగానే యాసంగి సాగు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే కొంతమంది రైతులు నారు పోసేందుకు సిద్ధం అవుతున్నారు. జిల్లాలో వానాకాలంలో 3లక్షల 85వేల ఎకరాల్లో వరిసాగైంది.
వరి సాగుకే రైతుల మొగ్గు..
జిల్లాలో కొన్నేళ్లుగా వరి సాగు చేస్తున్న రైతులు మాత్రం ఈ యాసంగిలో కూడా వరి వైపే మొగ్గుచూపుతున్నారు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూమిలో ఆరుతడి పంటలు వేస్తే దిగుబడి రాదని వారు వివరిస్తున్నారు. వ్యవసాయ అధికారులు సూచించిన పంటలను వేస్తే పెట్టుబడి పోను లాభాలు తక్కువగా ఉంటాయని వివరిస్తున్నారు. యాసంగిలో కూడా వరి వేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.లేదంటే రైతాంగం ఇబ్బందుల్లో పడుతుందని రై తు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూ గర్భ జలాలు ఉండడం, ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్న సమయం లో వరి సాగును వద్దంటే ఏ పంట వేసిన లాభాలు రావని సంఘాల నేతలు తెలిపారు. ప్రభుత్వమే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ధాన్యం కొనుగోలు చేసేవిధంగా చూడడంతో పాటు వరి సాగుకు అనుమతులు ఇవ్వాలని వారు కోరుతున్నారు.
ఆరుతడి పంటలపై అవగాహన
ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు ఏర్పడడం, ఎఫ్‌సీఐ ఎక్కువగా కొనుగోళ్లుచేసేందుకు ముందుకురాకపోవడం వల్ల యాసంగిలో వరిని తగ్గించాలని ప్రభుత్వం యంత్రాంగం ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. గడిచిన 15 రోజుల్లో పలు గ్రామాల పరిధిలో వ్యవసాయ అనుబంధాల శాఖల అధికారులు ఆరుతడి పంటలు సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని వివరిస్తున్నారు. ఈ యాసంగిలో వేరుశనగ, శనగ, ఆవాలు, నువ్వులు, ఆముదం, కుసుమ, పొద్దుతిరుగుడు, పెసర, మినుము పంటలు వేయాలని సూచిస్తున్నారు. ఈ విత్తనాలను కూడా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సహకార సొసైటీల్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంటున్నారు. శనగ, జేజీ11 రకం 10,500 క్వింటాళ్లు, ఎన్‌బీజీ 49 రకం 3300 క్వింటాళ్లు, జాకీ రకం 9వేల క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. పెసర 200 క్వింటాళ్లు, కందులు, మినుములు వంద క్వింటాళ్లను సీడ్‌ కార్పొరేషన్‌ ద్వారా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. సబ్సిడీ  లేకుండా రైతులకు ఈ విత్తనాలను 25 కిలోల బ్యాగుల చొప్పున అందించనున్నారు.
ప్రభుత్వం స్పష్టతనివ్వాలి..
- ఎర్రమాటి రామకృష్ణ,  రైతు

వరి సాగుపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. ప్రాజెక్టులో నీళ్లు ఉన్న సమయంలో వరి సాగు చేయవద్దనడం సరికాదు. ఏళ్ల తరబడి సాగు చేసిన భూముల్లో ఇతర పంటలు సాధ్యంకాదు. ఆరుతడి పంటలు సాగు చేసిన దిగుబడి రాదు. ప్రతామ్నాయ పంటలు వేయాలంటున్న ప్రభుత్వం తగినవిధంగా ఏర్పాట్లను చేయాలి.
కొనుగోలుపై కేంద్రాన్ని ఒప్పించాలి..
- అన్వేష్‌రెడ్డి, తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌

యాసంగిలో వరి సాగుకు ప్రభుత్వం అనుమతివ్వాలి. ధాన్యం కొనుగోలుకు కేంద్రాన్ని ఒప్పించాలి. ప్రాజెక్టులలో నీళ్లు ఉన్న సమయంలో వరి వద్దంటే రైతులు ఏ పంటలు వేయాలి. ఆరుతడి పంటలు వేసిన దిగుబడి వచ్చే పరిస్థితిలేదు. వరి పండించే భూముల్లో ఆరుతడి పంటలకు అనుకూలం కావు.
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి..
- గోవింద్‌, జిల్లా వ్యవసాయాధికారి

జిల్లాలో వరికి బదులుగా రైతులు ప్రత్యా మ్నాయ పంటలను సాగు చే యాలి. ఆరుతడి పంటల వల్ల రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. పెట్టుబడి కూడా తక్కువగా ఉంటుంది. మి నుములు, శనగ, వేరుశనగ, ను వ్వులు, ఆముదం, పప్పుదినుసులకు ఎక్కువగా మా ర్కెట్‌లో డిమాండ్‌ ఉంది. పెట్టుబడి తగ్గడంతో పాటు ఈ పంటలను వేస్తే లాభాలు ఎక్కువగా వస్తాయి.

Updated Date - 2021-10-29T05:43:17+05:30 IST