రైతుల కష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్తా
ABN , First Publish Date - 2021-12-31T07:15:35+05:30 IST
వడగళ్ల వానతో పంటనష్ట పోయిన రైతుల కష్టాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందించేందుకు కృషిచేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని హెగ్డోలి, దొమలెడ్గి, యాద్గార్‌పూర్, ఎత్తొండ, వల్లభాపూర్, సోంపూర్, గ్రామాల్లో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంట లను పరిశీలించారు.

స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
కోటగిరి, డిసెంబరు 30: వడగళ్ల వానతో పంటనష్ట పోయిన రైతుల కష్టాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందించేందుకు కృషిచేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని హెగ్డోలి, దొమలెడ్గి, యాద్గార్‌పూర్, ఎత్తొండ, వల్లభాపూర్, సోంపూర్, గ్రామాల్లో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంట లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మండలంలో సుమారు 7 వేల ఎకరాల్లో పొద్దుతి రుగుడు, శనగ, మొక్కజొన్న, మినుము పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 20 నిమిషాల పాటు వడగళ్ల వర్షం కురువడంతో పంటలన్నీ నేలమట్టమయ్యాయన్నారు. ప్రభుత్వ అదేశానుసారం రైతులు పంటమార్పిడిపై దృష్టిసారించినప్పటికీ ప్రకృతి కన్నెర్ర చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి వివరాలు అందించాలని సూచించారు. ఆయన వెంట బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్ధార్ శేఖర్, వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్‌రావు, జడ్పీటీసీ శంకర్‌పటెల్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కోల్లురు కిషోర్, సర్పంచులు ఏజాజ్‌ఖాన్, వెంకాగౌడ్, సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.