బోధన్‌ 18వ వార్డు ఉప ఎన్నిక ఫలితం నేడే

ABN , First Publish Date - 2021-05-03T05:22:11+05:30 IST

బోధన్‌ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు ఉప ఎన్నిక ఫలితం సోమవారం తేలనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభంకా నుంది.

బోధన్‌ 18వ వార్డు ఉప ఎన్నిక ఫలితం నేడే

రెండు రౌండ్‌లలో ఓట్ల లెక్కింపు పూర్తి
కౌంటింగ్‌ కేంద్రానికొచ్చేవారికి కరోనా టెస్ట్‌

బోధన్‌, మే 2: బోధన్‌ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు ఉప ఎన్నిక ఫలితం సోమవారం తేలనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభంకా నుంది. జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ట్రాంగ్‌రూంలో ఈవీఎంలను భద్రపరిచారు. సోమవా రం ఉదయం 7గంటలకు అధికారులు స్రాంగ్‌రూం నుం చి ఈవీఎంలను తీసి ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నా రు. తొలుతగా పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ఆ తర్వాత ఈ వీఎంలలోని ఓట్లలెక్కింపు కొనసాగనుంది. 18వ వార్డు ఉప ఎన్నికలో 75శాతం ఓట్లు పోలయ్యాయి. 3 పోలింగ్‌ స్టేషన్‌ల పరిధిలో మొత్తం 1,596 ఓట్లకు కానూ 1,199 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపు కోసం రెండు టేబుళ్ల ను అధికారులు ఏర్పాటు చేశారు. రెండు టేబుళ్లలో రెం డు రౌండ్‌లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఉదయం 10గంటలలోపు ఫలితం తేలిపోనుంది. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి పోటీ చేసిన అభ్యర్థితో పాటు ఒక్కో ఏజెంట్‌ కు మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు. ఆదివా రం పోటీ చేసిన అభ్యర్థులు కౌటింగ్‌ ఏజెంట్‌లు, రిటర్ని ంగ్‌ అధికారి, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి ఇతర కౌం టింగ్‌ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించడం జరిగిం దని, అందరికీ నెగిటివ్‌ వచ్చిందని ఆర్డీవో రాజేశ్వర్‌ తెలి పారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు కౌంటింగ్‌ కేం ద్రంలోకి కరోనా పరీక్షలు నిర్వహించుకొని నెగిటివ్‌ రిపో ర్టు ఉన్నవారికి మాత్రమే అనుమతిస్తున్నామని ఆర్డీవో రాజేశ్వర్‌ తెలిపారు. అదే విధంగా ఉప ఎన్నిక ఫలితం అనంతరం బోధన్‌లో ఎవరూ ర్యాలీలు నిర్వహించవద్ద ని ఆర్డీవో రాజేశ్వర్‌ హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌ ఆ దేశాల మేరకు ర్యాలీలు నిషేధమని ఆయన స్పష్టం చే శారు. పోలీసులకు ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే స్పష్టమై న ఆదేశాలు ఇచ్చిందని, కొవిడ్‌ నిబంధనల మేరకు గెలి చిన అభ్యర్థి ర్యాలీలు, ఉత్సవాలు నిర్వహించవద్దని, ఒక వేళ నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

Updated Date - 2021-05-03T05:22:11+05:30 IST