రంగనాథ ఆలయ భూముల్లో బోర్డు పాతిన అధికారులు

ABN , First Publish Date - 2021-11-27T04:41:44+05:30 IST

పట్టణ కేంద్రంలోని రంగనాథ ఆలయ భూముల్లో దేవాదాయ శాఖ అధికారులు శుక్రవారం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.

రంగనాథ ఆలయ భూముల్లో బోర్డు పాతిన అధికారులు
ఎల్లారెడ్డిలో దేవాదాయశాఖ స్థలంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసిన అధికారులు

ఎల్లారెడ్డి, నవంబరు 26: పట్టణ కేంద్రంలోని రంగనాథ ఆలయ భూముల్లో దేవాదాయ శాఖ అధికారులు శుక్రవారం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. గాంధీచౌక్‌ నుంచి ఎల్లారె డ్డి ప్రయాణ ప్రాంగణం మొదలుకొని పన్నాలాల్‌ కాలనీ వరకు 19.21 గుంటల భూముల్లో ఉన్న పలు సర్వే నెంబర్లలోని భూములు ఆక్రమణకు గురి అయిందని తెలుసుకొని బోర్డులు పెట్టామని ఆలయ కార్యనిర్వహణాధికారి అంజయ్య అన్నారు. 1954ల రంగానాథ స్వామి దేవునిపేరిట పన్నాలాల్‌ రిజిస్ట్రేషన్‌ చేయడం జరిగిందని అన్నారు. కబ్జాలకు పాల్పడిన వారికి త్వరలో నోటీసులు ఇస్తామని తెలిపారు. అక్రమ కట్టడాలకు సంబంధించిన 256 రిజిస్ట్రేషన్‌లను కూడా రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ భాస్కర్‌, తహసీల్దార్‌ గీత, ఇన్‌స్పెక్టర్‌ మధుబాబు, ఈవో అంజయ్య, ఆర్‌ఐ మహ్మద్‌, సర్వేయర్‌ అభిలాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-27T04:41:44+05:30 IST