నెత్తురోడిన రోడ్లు

ABN , First Publish Date - 2021-12-19T06:51:59+05:30 IST

జిల్లాలో శనివారం ప్రధాన రహదారులు నెత్తురొడ్డాయి. జుక్కల్‌ నియోజకవర్గ పరిధిలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఒకేరోజు 9 మంది మృతి చెందారు.

నెత్తురోడిన రోడ్లు

జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి

పెద్దకొడప్‌గల్‌ వద్ద అతివేగానికి ఏడుగురి దుర్మరణం

దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా దుర్ఘటన

ఆగి ఉన్న లారీని ఢీకొన్న క్వాలీస్‌ వాహనం

ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం 

చికిత్స పొందుతూ చిన్నారి మృతి

మృతుల్లో ఇద్దరు మగవారు, ఇద్దరు మహిళలు, మరో ముగ్గురు చిన్నారులు

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారు

అతివేగమే ప్రమాదానికి కారణం

కండేబల్లుర్‌లో కల్టివేటర్‌ను ఢీకొన్న 

ద్విచక్ర వాహనం.. ఇద్దరు యువకుల మృతి

మూల మలుపు వద్ద అతివేగమే ప్రమాదానికి కారణమంటున్న పోలీసులు


కామారెడ్డి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి)/ పెద్దకొడప్‌గల్‌: జిల్లాలో శనివారం ప్రధాన రహదారులు నెత్తురొడ్డాయి. జుక్కల్‌ నియోజకవర్గ పరిధిలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఒకేరోజు 9 మంది మృతి చెందారు. ఈ రెండు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని తెలుస్తోం ది. పెద్ద కొడప్‌గల్‌ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7 గురు మృత్యువాత పడగా, జుక్కల్‌ మండలం కండేబల్లూర్‌ మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. దైవదర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా కనురెప్పపాటున అతివేగం ఏడుగురిని బలి తీసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా.. మరో కుటుంబానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. నాందేడ్‌లోని దర్గా దర్శనం చేసుకుని రెండు కుటుంబాలు పిల్లాపాపలతో తిరిగి వస్తుండగా పెద్దకొడప్‌గల్‌ మండలంలోని 161వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతివేగంతో క్వాలీస్‌ ఢీకొనడంతో హైదరాబాద్‌కు చెందిన అమిర్‌తాజ్‌(32), సనబేగం(24), హనియా(2), 6 నెలల పాప అనాస్‌, ఎండీ హుస్సెన్‌(34), తస్లీమా బేగం(25) ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా నిజామాబాద్‌లో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నూరా(6) మరో చిన్నారి మృతి చెందింది. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని చంద్రాయన్‌గుట్ట ప్రాంతానికి చెందిన అమిర్‌తాజ్‌, ఫలక్‌నామాకు చెందిన ఎండీ హుస్సెన్‌లు దగ్గరి బంధువులు. వీరిద్దరు కుటుంబసభ్యులైన సనబేగం, తస్లీమాబేగం వీరి పిల్లలు హనియా, అనాస్‌, హజీరా, హిబ్బా, ఆదిల్‌, నూరా, సుల్తాన్‌, పాతిమాలతో కలిసి ఈ నెల 16న  మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలోని కందర్‌ దర్గాకు దర్శనం నిమిత్తం క్వాలీస్‌లో వెళ్లారు. దర్శనం అనంతరం శనివారం తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణం అయ్యారు. 161 జాతీయ రహదారి వెంట పెద్ద కొడప్‌గల్‌ మండలం మీదుగా వెళ్తున్నారు. మండలంలోని జగన్నాథపల్లి గ్రామ శివారుల్లో జాతీయ రహదారి పక్కన ఆగిఉన్న లారీని క్వాలీస్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో అమీర్‌తాజ్‌, సన బేగం, ఎండీ హుస్సెన్‌, తస్లీమా బేగం, హనియా, అనాస్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో నూరా అనే చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. అతివేగంగా క్వాలీస్‌ లారీని ఢీకొనడంతో ముందుభాగం పూర్తి గా ధ్వంసమయి మృతదేహాలతో పాటు క్షతగాత్రులు అందులోనే చిక్కుకుపోయారు. జరిగిన రోడ్డు ప్రమాదాన్ని స్థానికులు గమనించి అక్కడికి చేరుకున్నారు. క్వాలీస్‌లో ఉన్న వారిని బయటకు తీసేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమించారు. వెనుక భాగంలో ఉన్న వారిని స్థానికులు బయటకు తీశారు. విషయం తెలుసుకున్న బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి, బిచ్కుంద సీఐ శోభన్‌, పెద్దకొడప్‌గల్‌ ఎస్‌ఐ విజయ్‌కొండలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో క్వాలీస్‌ ముందుభాగం నుజ్జునుజ్జుకావడంతో మృతదేహాలు అందు లోనే చిక్కుకుపోయాయి. దీంతో క్రేన్‌ తెప్పించి క్వాలీస్‌ను వెనక్కి తీసి మృతదేహాలను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన ఆరుగురిని వైద్యచికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వారందరు చిన్నపిల్లలే ఉన్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బాన్సువాడ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. జరిగిన ఘటనలో మృతి చెందిన, క్షత గాత్రులైన వారి వివరాలను సేకరించేందుకు పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నలుగురు పెద్దవారు చనిపోవడంతో క్షతగాత్రులందరు చిన్నపిల్లలే ఉండడం, తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండడంతో ఎవరు ఎవరికి వరుస అవుతారు, ఏ పిల్లలు ఎవరికి చెందిన వారో అనే వివరాలు తెలియరాలేకపోయాయి. బాధితులు ఫోన్‌ ద్వారా పోలీసులు కుటుంబ సభ్యులకు జరిగిన సంఘటనపై సమాచారం అందించారు. మృతుల బంధువులు సంఘటన స్థలానికి వస్తేగా ని పూర్తి వివరాలు తెలిసే విషయం ఉంటుందని డీఎస్పీ జైపాల్‌రెడ్డి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించామని అన్నారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్‌ మండలం జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారన్న విషయం తెలిసిన బం ధువులతో పాటు స్థానికంగా ఉండేవారిని కలిచివేస్తోంది. హైదరాబాద్‌లోని చం ద్రాయన్‌గుట్టలో నివాసం ఉండే అమీర్‌తాజ్‌ భార్య సనబేగంలతో పాటు వీరిద్దరి పిల్లలు హనియా, అనాస్‌లు మృతి చెందారు. అమీర్‌తాజ్‌ ఏసీ మెకానిక్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎప్పుడు కుటుంబసభ్యులంతా కలిసి సరదాగా, ఆనందంగా గడుపుతుండేవారని స్థానికులు పేర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారే మృతి చెందడంతో చంద్రాయన్‌గుట్టలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఘటన స్థలం వద్ద స్థానికులను సైతం ఈ  రోడ్డు ప్రమాదం కలిచివేయడంతో పాటు పలువురు కంటతడి పెట్టుకున్నారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో భాన్యాభర్తలైన ఎండీ హుస్సెన్‌, అతని భార్య తస్లీ మా బేగం, కూతురు నూరా మృతి చెందడంతో ఫలక్‌నామా ప్రాంత ంలోనూ విషాదఛాయలు నెలకొన్నాయి. దగ్గరి బంధువులైన ఏడుగురు చనిపోవడంతో మృతుల కుటుంబాలతో పాటు బంధువులలోనూ తీరని శోకాన్ని నింపింది.

క్షతగాత్రులలో ముగ్గురు పరిస్థితి విషమం

పెద్దకొడప్‌గల్‌ మండలం జగన్నాథపల్లి శివారులోని జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు బాన్సువాడ వైద్యులు తెలిపారు. వీరికి మెరుగైన వైద్యం అందించేందుకై నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులైన వారిలో హజీరా, హైబా, ఆదిల్‌, నూరా, సుల్తాన్‌, ఫాతిమాలు ఉన్నారు. వీరిలో హజీరాలోని శరీరభాగంలో ఎముకలు పూర్తిగా విరిగిపోయాయని, ఆదిల్‌ తలకు తీవ్రగాయం అయిందని, ఫాతిమా పల్స్‌రేటు పడిపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా నూరా నిజామాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందు తూ రాత్రి మృతి చెందింది.

అతివేగమే ప్రమాదానికి కారణం

మహారాష్ట్రలోని నాందేడ్‌ నుంచి హైదరాబాద్‌కు 161 నాలుగు లైన్ల జాతీయ రహదారిని ఇటీవల చేపట్టారు. ఈ జాతీయ రహదారి వెంబట ఇటీవల కాలంలో చాలా నే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అనేక మంది మృత్యువాత పడ్డారు. శనివారం పెద్ద కొడప్‌గల్‌ మండ లం జగన్నాథపల్లి శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అమిర్‌తాజ్‌, హుస్సెన్‌ల కుటుంబాలు క్వాలీస్‌లో నాందేడ్‌ జిల్లాలోని దర్గాను దర్శించుకుని తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. అమీర్‌తాజ్‌ డ్రైవింగ్‌ చేస్తున్నాడు. జాతీయ రహ దారి కావడంతో అతివేగంతో వాహనాన్ని నడిపినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. 100 నుంచి 120 కిలో మీటర్ల వేగంతో ఉన్న క్వాలీస్‌ అమీర్‌తాజ్‌కు కంట్రోల్‌ కాకపోవడంతో జగన్నాథపల్లి వద్ద అదుపుతప్పి రోడ్డు కిందికి దిగి పక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొన్నట్లు ప్రత్యేక్ష సాక్షులు చెబుతున్నారు. అతివేగంతో క్వాలీస్‌ ఆగిఉన్న లారీని ఢీకొనడంతో ముందు సీట్ల భాగంలో కూర్చున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతివేగమే ఆరుగురిని బలి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఖండెబల్లూర్‌లో ఇద్దరు మృతి

బాన్సువాడ : జుక్కల్‌ మండలం ఖండెబల్లూర్‌ గ్రామం బాలాజీ నగర్‌ చౌరస్తాలో చోటు చేసుకుంది. వివరాలు.. జుక్కల్‌ మండలం కెంరాజ్‌ కల్లాలి గ్రామానికి చెందిన సాయిలు (32), శివ గొండ(32) అనే యువకు లు జుక్కల్‌ మండల కేంద్రానికి పని నిమిత్తం వెళ్లారు. జుక్కల్‌ నుంచి కెంరాజ్‌ కల్లాలి స్వగ్రామానికి వెళుతుండగా, మండలంలోని ఖండెబ ల్లూర్‌ గ్రామం బాలాజీ నగర్‌ చౌరస్తా వద్ద రోడ్డు పక్క న ఉన్న కల్టివేటర్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు యువకు లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటీన క్షతగాత్రులను బాన్సు వాడ ఆస్పత్రికి తరలిస్తుండగా, మా ర్గమధ్యలోనే ఇద్దరు మృతి చెందిన ట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు. దీంతో కెంరాజ్‌కల్లాలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Updated Date - 2021-12-19T06:51:59+05:30 IST