25న బీసీ ప్రభుత్వ ఉద్యోగుల మహాసభ

ABN , First Publish Date - 2021-08-21T05:11:05+05:30 IST

బీసీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 25న జిల్లాకేంద్రంలో నిర్వహించే మహాసభకు బీసీ ఉద్యోగులు పెద్దఎత్తున తరలిరావాలని కామారెడ్డి అధ్యక్షుడు వెంకటేష్‌ పిలుపునిచ్చారు.

25న బీసీ ప్రభుత్వ ఉద్యోగుల మహాసభ

కామారెడ్డిటౌన్‌, ఆగస్టు 20: బీసీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 25న జిల్లాకేంద్రంలో నిర్వహించే మహాసభకు బీసీ  ఉద్యోగులు పెద్దఎత్తున తరలిరావాలని కామారెడ్డి అధ్యక్షుడు వెంకటేష్‌ పిలుపునిచ్చారు. బీసీ ఉద్యోగులకు క్రిమిలేయర్‌ విధానాన్ని ఎత్తివేయాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, చట్టసభలలో, అన్ని రాజకీయ అవకాశాలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలన్నారు. బీ.పీ మండల్‌ జయంతి సందర్భంగా విద్యుత్‌ బీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో మహసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు.

Updated Date - 2021-08-21T05:11:05+05:30 IST