హోం స్టెడ్‌ నర్సరీలపై అవగాహన

ABN , First Publish Date - 2021-05-02T06:36:07+05:30 IST

మెప్మా ఆధ్వర్యంలో పెంచుతున్న హోం స్టెడ్‌ నర్సరీలపై శనివారం అవగాహన కల్పించారు.

హోం స్టెడ్‌ నర్సరీలపై అవగాహన

నిజామాబాద్‌అర్బన్‌, మే 1: మెప్మా ఆధ్వర్యంలో పెంచుతున్న హోం స్టెడ్‌ నర్సరీలపై శనివారం అవగాహన కల్పించారు. మున్సిపల్‌ సెక్రెటరి ప్రభాకర్‌, ప్రాజెక్ట్‌ అదికారి రమేష్‌, మెప్మా టీఎంసీ శోభరాణి నగరంలో పెంచుతున్న నర్సరీలను పరిశీలించారు. రాబోయే హరితహారం కార్యక్రమానికి నర్సరీలు అందుబాటులో ఉండేవిధంగా మొక్కలు పెంచాలని సూచించారు. ఎండలు పెరిగిన దృష్ట్యా ప్రతి మొక్కకు సరిపడా నీటిని అందించి మొక్కలు పెరిగేలా చూడాలన్నారు. నగరంలో మెప్మా ద్వారా ఆరు నర్సరీలలో ఆరు లక్షల ఫల, పుష్ప ఔషద మొక్కలను పెం చుతున్నామని వాటిని హరితహారంలో ఇంటింటికీ అందజేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రాజెక్ట్‌ అధికారి రమేష్‌ తెలిపారు.

Updated Date - 2021-05-02T06:36:07+05:30 IST