పంటల మార్పిడిపై రైతులకు అవగాహన

ABN , First Publish Date - 2021-12-19T06:48:01+05:30 IST

పంటల మార్పిడి, పంటల సాగుపై మాల్తు మ్మెద ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించారు.

పంటల మార్పిడిపై రైతులకు అవగాహన
వ్యవసాయ ప్రదర్శనల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్న విద్యార్థులు

నాగిరెడ్డిపేట, డిసెంబరు 18: పంటల మార్పిడి, పంటల సాగుపై మాల్తు మ్మెద ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించారు. శనివారం బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్య క్రమంలో భాగంగా ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో రైతు సదస్సును ఏర్పాటు చేశారు. పంటల మార్పిడి, అధిక దిగుబడులు గురించి, చీడపీడల సస్యరక్ష ణ, వివిధ అంశాలపై స్టాళ్లను ఏర్పాటు చేసి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ మురళి, శాస్త్రవేత్త రేవ ంత్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అనిల్‌ రెడ్డి, ఏవో విజయ్‌ శేఖర్‌, ఏఈవో బబిత, ఎంపీటీసీ నారాయణ, మాల్తుమ్మెద సొసైటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, యూనివ ర్సిటీ విద్యార్థులు అఖిల, కల్పన, ప్రీతిక, కీర్తి, నితిన్‌, భార్గవ్‌, గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

మద్నూర్‌: యాసంగిలో వేసిన శనగ పంటలను ఏవో రాజు శనివారం పరిశీ లించారు. రైతులు యాసంగిలో సాగుచేస్తున్న పంటలను ఏఈవోల దగ్గర నమోదు చేసుకోవాలని సూచించారు. శనగలో ఎండు తెగుళ్ల నివార ణకు కాపర్‌ అక్సిక్టో రైడ్‌ 3 గ్రాములు లీటర్‌ నీటికి కలిపి మొక్క మొదళ్లు తడిచేలా పిచికారి చేయాలని, మొక్కజొన్న, జొన్న పంటల్లో కత్తెర పురుగు ఉంటే క్లోరంత్రి నిప్రోల్‌ 100 మిల్లీలీటర్ల మందును ఎకరాకు పిచికారీ చేయా లని సూచించారు. పంటలకు సంబంధించిన ఎలాంటి సందేహాలున్నా వ్యవసాయాధికారులను సంప్రదించాలన్నారు.

Updated Date - 2021-12-19T06:48:01+05:30 IST