బీర్కూర్‌లో ఇరువర్గాల దాడి
ABN , First Publish Date - 2021-12-12T05:15:00+05:30 IST
ఇరువర్గాల మధ్య చిన్నపాటి గొడవ దాడులకు దారితీసింది. దీంతో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బీర్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. మండల కేంద్రంలోని పోచారం కాలనీ పక్కన గల ముల్లాగల్లీలో సజ్జ త్ నూతనంగా ఇంటిని నిర్మిస్తున్నాడు.
ఐదుగురికి తీవ్ర గాయాలు
బీర్కూర్, డిసెంబరు 11: ఇరువర్గాల మధ్య చిన్నపాటి గొడవ దాడులకు దారితీసింది. దీంతో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బీర్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. మండల కేంద్రంలోని పోచారం కాలనీ పక్కన గల ముల్లాగల్లీలో సజ్జ త్ నూతనంగా ఇంటిని నిర్మిస్తున్నాడు. ఇంటి నిర్మాణానికి అక్రమంగా వి ద్యుత్‌ను వాడుతుండగా ఇంటి ముందర ఉన్న సళ్లు అనే వ్యక్తి విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అంతేగాక అక్రమంగా కరెంట్ వాడుతున్నా డని అందరికి చెబుతున్నాడన్న కోపంతో సజ్జత్ తన అల్లుళ్లతోకలిసి సళ్లుతో గొడవపడ్డారు. గొడవ తీవ్రతరం కావడంతో సళ్లు తన స్నేహితులతో కలిసి సజ్జత్, అల్లుళ్లపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో సజ్జత్ అల్లుళ్లు అస్లాం, ఫాయాజ్, సమీ, హలీం, మోయిన్‌లకు గాయలయ్యాయి. ఘటన స్థలాన్ని సీఐ చంద్రశేఖర్, ఎస్సై నాగభూషణం పరిశీలించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సజ్జత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.