ఆర్‌వోబీ పనులను వేగంగా చేయాలి : ఎంపీ
ABN , First Publish Date - 2021-10-30T05:13:57+05:30 IST
పార్లమెంట్ పరిదిలో చేపట్టిన ఆర్‌వోవీ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఎంపీ అర్వింద్ కోరారు.
పెద్దబజార్, అక్టోబరు 29: పార్లమెంట్ పరిదిలో చేపట్టిన ఆర్‌వోవీ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఎంపీ అర్వింద్ కోరారు. ఈ మేరకు ఆయన రైల్వే జనరల్ మేనేజర్ గజానన్‌మాల్యాకు లేఖ రాశారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన అడవి మామిడిపల్లి, గోవింద్‌పేట్, ఆర్మూర్ మామిడిపల్లి ఆర్‌వోబీ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. నిర్మాణాలు పూర్తికాకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. కేంద్రం నిధులతో చేపట్టిన ఈ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆయన కోరారు.