పేకాటరాయుళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2021-10-31T05:55:28+05:30 IST

మండలంలోని ఖాజాపూర్‌ గ్రామంలో పేకాట స్థావరంపై శుక్రవారం దాడి చేయగా ఆరుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్లు రూరల్‌ ఎస్సై సందీప్‌ తెలిపారు.

పేకాటరాయుళ్ల అరెస్టు

బోధన్‌రూరల్‌, అక్టోబరు 30: మండలంలోని ఖాజాపూర్‌ గ్రామంలో పేకాట స్థావరంపై శుక్రవారం దాడి చేయగా ఆరుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్లు రూరల్‌ ఎస్సై సందీప్‌ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.3020 స్వాధీనం చేసుకున్నామని, సాలూర గ్రామంలోనూ ఆరుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేయడంతోపాటు వారి వద్ద నుంచి రూ.6390 స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నెలలో మొత్తం ఆరు పేకాట కేసులు నమోదు చేయడంతోపాటు 31 మందిపై కేసు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు రూ.21030 స్వాధీనం చేసుకున్నామని, పేకాట ఆడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Updated Date - 2021-10-31T05:55:28+05:30 IST