సరిహద్దుల్లో పకడ్బందీగా తనిఖీలు

ABN , First Publish Date - 2021-05-18T06:21:13+05:30 IST

మహారాష్ట్ర సరిహద్దులో గల వైద్య శిబిరం చెక్‌పోస్టు వద్ద పోలీసులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం మహారాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్ర చెక్‌పోస్టును సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర నుంచి వస్తు

సరిహద్దుల్లో పకడ్బందీగా తనిఖీలు
రహదారిపై అప్రమత్తంగా ఉన్న పోలీసులు

మద్నూర్‌, మే 17: మహారాష్ట్ర సరిహద్దులో గల వైద్య శిబిరం చెక్‌పోస్టు వద్ద పోలీసులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం మహారాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్ర చెక్‌పోస్టును సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న ప్రతీ వాహనానికి తనిఖీ చేయాలని, భారీ వాహనాలకు పర్మిషన్‌ ఇవ్వాలని, ప్రయాణికులకు సంబంధించిన వాహనాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోకి రాకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. ఆయనతో పాటు మద్నూర్‌ ఎస్సై రాజు, ఏఎస్సై తదితరులున్నారు. 

Updated Date - 2021-05-18T06:21:13+05:30 IST