సెల్‌ఫోన్‌ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-12-20T05:06:58+05:30 IST

స్టేట్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్‌పల్లి ఆధ్వర్యంలో ఉచిత సెల్‌ఫోన్‌ శిక్షణకు ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు సోమవారంతో గడువు ముగుసుం్తదని ఎస్‌బీఐ డైరెక్డర్‌ సుదీంద్రబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సెల్‌ఫోన్‌ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి


డిచ్‌పల్లి, డిసెంబరు 19:  స్టేట్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్‌పల్లి ఆధ్వర్యంలో ఉచిత సెల్‌ఫోన్‌ శిక్షణకు ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు సోమవారంతో గడువు ముగుసుం్తదని ఎస్‌బీఐ డైరెక్డర్‌ సుదీంద్రబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన యువకులకు ఈ అవకాశం ఉందన్నారు. నేర్చుకునే వారికి ఉచిత వసతి, భోజన, శిక్షణ, ఇవ్వడం జరుగుతుందనితెలిపారు. ఆసక్తిగల వారు 19-45 ఏళ్ల వయస్సు గల యువకులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 08461-222428 నంబర్‌ కు సంప్రదించాలని పేర్కొన్నారు.

Updated Date - 2021-12-20T05:06:58+05:30 IST