రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-02-07T04:59:55+05:30 IST

కేంద్రం వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సీపీఎం జోన్‌ కార్యదర్శి కొత్త నర్సింలు అన్నారు.

రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి
నాగిరెడ్డిపేటలో రాస్తారోకో చేస్తున్న రైతులు

భిక్కనూరు, ఫిబ్రవరి 6: కేంద్రం వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సీపీఎం జోన్‌ కార్యదర్శి కొత్త నర్సింలు అన్నారు. శనివారం భిక్క నూరు మండలంలోని 44వ జాతీయ రహదారిపై గల టోల్‌ప్లాజా వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ మేరకు కొత్త నర్సింలు మాట్లా డుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ సంస్థలను ఒక్కొ క్కటిగా ప్రైవేటుపరం చేస్తోందని ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నెలల తరబడి ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తుంటే రద్దు చేయకపోవడమే కాకుండా రైతులపై దాడులకు పాల్పడు తుందన్నారు. వెంటనే కేంద్రం నూతన రైతు చట్టాలను రద్దు చేయాలని లేనియెడల ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు చిన్న సాయిలు, రాజయ్య, స్వామి, పెద్ద సాయిలు, నారాయణ, పాల్‌, తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేటలో..
నాగిరెడ్డిపేట: రైతులు శనివారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట, బోధన్‌ - హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం కొనసాగించాలని నినాదాలు చేశారు. రైతు వ్యతిరేక కార్యకలాపాలపై నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనసాగించకుంటే రైతులు ఉద్యమాలకు సిద్ధం అవుతారని హెచ్చరించారు. రాస్తారోకో వద్దకు పోలీసు లు చేరుకుని రైతులను సముదాయించి రాస్తారోకోను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జయరాజ్‌, రైతులు నారాయణరెడ్డి, బాబు రావు, అంజయ్య, జగన్‌రెడ్డి, మహేష్‌రెడ్డి, పురుషోత్తం రెడ్డి, బలరాం రెడ్డి, కృష్ణ, ఆయా గ్రామాల రైతులు తదితరులున్నారు.
పెద్ద కొడప్‌గల్‌లో..

పెద్ద కొడప్‌గల్‌: మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గంగారాం ఆధ్వర్య ంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీలో రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా చేస్తున్న ధర్నాకు మద్దతుగా శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంగారాం మాట్లాడుతూ ఢిల్లీలో గత కొన్ని రోజులుగా రైతులు ధర్నా, నిరసన కార్యక్రమాలను చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-07T04:59:55+05:30 IST