బాన్సువాడలో మరో నకిలీ నోటు

ABN , First Publish Date - 2021-07-25T04:56:30+05:30 IST

పట్టణంలో నకిలీ నోట్ల కలక లం దుమారం రేపడంతో ఒక్కొక్కటిగా నకిలీ నోట్లు బయట పడుతున్నాయి.

బాన్సువాడలో మరో నకిలీ నోటు
బాన్సువాడలో ప్రత్యక్షమైన రూ.500 నకిలీ నోటు

తాజాగా రూ.500 నకిలీ నోట్లు మార్కెట్‌లో బయట పడ్డ వైనం
మధ్యప్రదేశ్‌ పోలీసుల రాకతో మరికొంత మంది యువకులు అజ్ఞాతంలోకి
ఏది అసలు.. ఏది నకిలీనో తెలియక తికమక
పెద్ద నోట్లు తీసుకోవడానికి జంకుతున్న వ్యాపారులు

బాన్సువాడ, జూలై 24: పట్టణంలో నకిలీ నోట్ల కలక లం దుమారం రేపడంతో ఒక్కొక్కటిగా నకిలీ నోట్లు బయట పడుతున్నాయి. మధ్యప్రదేశ్‌ పోలీసులు బాన్సు వాడ యువకుడిని నకిలీ నోట్ల వ్యవహారంలో అదుపులోకి తీసుకెళ్లడంతో తాజాగా బాన్సువాడ పట్టణంలో నకిలీ నోట్లు బయట పడటంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతు న్నారు. తాజాగా బాన్సువాడ పట్టణంలో ఓ వ్యక్తి బ్యాంకు లో డబ్బులు వేసేందుకు వెళ్లగా, బ్యాంకు అధికారులు నకిలీ నోటుగా గుర్తించి ఫేక్‌ నోటుగా తొలగించారు. దీంతో గత నెల క్రితమే నకిలీ నోట్లు బాన్సువాడలో చలా మణి అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది అసలు, ఏది నకిలో తెలియక ప్రజలు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులు, ప్రజలు రూ.2 వేలు, రూ.500, రూ.200 నోట్లు తీసుకోవాలంటేనే జంకు తున్నారు. గత ఆరు నెలల క్రితమే బాన్సువాడ యువకు డు ఛత్తీస్‌ఘడ్‌ యువకుడితో సంబంఽధాలు పెట్టుకుని రూ.8 లక్షలు తీసుకుని వచ్చి చలామణి చేశాడా, లేక ఇతర వ్యక్తులు ఎవరైనా నకిలీ నోట్లను బాన్సువాడలో చలామణి చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నా యి. గత నెల క్రితం వర్ని నుంచి రూ.2 వేల నకిలీ నోటు బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్‌ వ్యక్తి వద్ద ఉండ టంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఒక్కరే ఈ నకిలీ నోట్లను చలామణి చేశారా, ఇతర వ్యక్తు లతో ఎవరైనా సంబంఽధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తే తప్ప బయట పడే అవకాశాలున్నా యని ప్రజలు పేర్కొంటున్నారు. అయితే, మధ్యప్రదేశ్‌ పోలీసులు గురువారం అర్ధరాత్రి బాన్సువాడకు వచ్చి యువకున్ని అదుపులోకి తీసుకుని బోపాల్‌కు తరలించిన విషయం తెలిసిందే. దీంతో ఆ యువకుడితో సంబంధాలు న్న మరికొంత మంది యువకులు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. మధ్యప్రదేశ్‌ పోలీసు లు యువకున్ని విచారిస్తే తప్ప ఎక్కడెక్కడ నకిలీ నోట్లు చలామణి అయ్యాయి, ఎవరెవరి వద్ద ఉన్నాయి, ఎవరెవ రితో సంబంధాలున్నాయనే వివరాలు బయటపడే అవకా శాలున్నాయి.

Updated Date - 2021-07-25T04:56:30+05:30 IST