ఖద్గాంలో యువకుడి అనామానాస్పద మృతి

ABN , First Publish Date - 2021-12-30T06:50:52+05:30 IST

వివాహానికి వెళ్లి వస్తూ.. ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మండలంలోని ఖద్గాం గ్రామ శివారులో చోటు చేసుకుంది.

ఖద్గాంలో యువకుడి అనామానాస్పద మృతి

  ఇసుక లారీ ఢీకొనవడం వల్లే మృతి చెందాడని బంధువుల ఆందోళన

  బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

బిచ్కుంద, డిసెంబరు 29: వివాహానికి వెళ్లి వస్తూ.. ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మండలంలోని ఖద్గాం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఇసుక లారీ ఢీకొట్టడం వల్లే యువకుడు మృతి చెందాడని ఆరో పిస్తూ మృతుడి కుటుంబీకులు బుధవారం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. బిచ్కుంద మండలం గుండెకల్లూర్‌ గ్రామానికి చెందిన యాదుగొండ(30) స్థానికంగా కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం బోర్లం గ్రామంలో బంధువుల పెళ్లికి వెళ్లాడు. కానీ రాత్రయినా తిరిగి ఇంటికి చేరుకోలేదు. బుధవారం ఉదయం ఖద్గాం గ్రామ శివారులో పొలాలకు వెళ్తున్న రైతులకు రోడ్డు పక్కన బైక్‌, పంట పొలంలో మృతదేహం పడి ఉండడంతో పోలీసుల కు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థ లానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కుటుం బీకు లకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న బంధువులు యాదుగొండ మృతిపై అనుమానం వ్యక్తం చేశా రు. ఇసుక లారీ ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. దారి గుండా నిత్యం పదుల సంఖ్యలో ఇసుకలారీలు తిరుగుతాయని, ఏదైనా లారీ ఢీకొట్టడం వల్లే  మృతి చెందాడని ఆరోపించారు. మృతికి కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు, బంధువులు ఖద్గాం-కుర్ల రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీ సులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.  బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి, సీఐ శోభన్‌ ఘటనా స్థలికి వెళ్లి ప్రమాదం తీరును పరిశీలించారు. ఆందోళన కారులతో మాట్లాడి వారిని శాంతింపజేశారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి.. వీలైనంత త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ జైపాల్‌రెడ్డి తెలిపారు. కాగా.. మృతుడు యాదు గొండకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు విద్యాశ్రీ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-30T06:50:52+05:30 IST