అంగన్‌వాడీలూ సిద్ధం

ABN , First Publish Date - 2021-08-28T05:14:31+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు ఒకటి నుంచి పాఠశాలతోపాటు అంగన్‌వాడీ కేంద్రాలు కూడా పున:ప్రారంభం కానున్నాయి. అంగన్‌వాడీ టీచర్లు పిల్లలకు ప్రత్యక్ష బోధన చేపట్టనున్నారు. దీంతో జిల్లాలోని అంగన్‌వాడీ సెంటర్లలో చిన్నారుల కోసం ఏర్పాట్లను చేస్తున్నారు.

అంగన్‌వాడీలూ సిద్ధం

 కేంద్రాలలో ప్రత్యక్ష బోధనకు ఏర్పాట్లు

 తల్లిదండ్రులకు వాట్సాప్‌ ద్వారా సమాచారం

  అంగన్‌వాడీ కేంద్రాలకు చేరిన మెడికల్‌ కిట్స్‌, ఇతర సామగ్రి

 జిల్లాలో 1193 సెంటర్లు, 59073 మంది చిన్నారులు

కామారెడ్డి, ఆగస్టు 27: రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు ఒకటి నుంచి పాఠశాలతోపాటు అంగన్‌వాడీ కేంద్రాలు కూడా పున:ప్రారంభం కానున్నాయి. అంగన్‌వాడీ టీచర్లు పిల్లలకు ప్రత్యక్ష బోధన చేపట్టనున్నారు. దీంతో జిల్లాలోని అంగన్‌వాడీ సెంటర్లలో చిన్నారుల కోసం ఏర్పాట్లను చేస్తున్నారు. వాట్సాప్‌ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం, కేంద్రాలకు మెడికల్‌ కిట్స్‌తోపాటు ఇతర సామగ్రి సరాఫరా చేస్తున్నారు. ప్రస్తుతం సరుకులు సమకూర్చుకోవడం కోసం సెంటర్ల ఖాతాల్లో స్పెషల్‌ ఫండ్‌ నుంచి రూ.500 జమ కానున్నాయి .జిల్లాలో మొత్తం 1193 అంగన్‌వాడీ కేందాలు ఉండగా అందులో మొత్తం మెయిన్‌ కేంద్రాలు 1038, మిని కేంద్రాలు 155 ఉన్నా యి. కామారెడ్డి ప్రాజెక్ట్‌ పరిధిలో 13134, దోమకోండ ప్రాజెక్ట్‌ పరిధిలో 10631, ఎల్లారెడ్డి ప్రాజెక్ట్‌ పరిధిలో 12238, బాన్సువాడ ప్రాజెక్ట్‌ పరిధిలో 11182, మద్నూ ర్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో 11888 మంది పిల్లలున్నారు. గర్భిణులు 7306, బాలింతలు 8819 మంది ఉన్నారు.

ఇప్పటివరకు ఇంటికే సరుకులు..

ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటలవరకు కేంద్రాలు కొనసాగుతాయి. కరోనా నేపథ్యంలో పిల్లలకు గుడ్లు, పాలు, బాలమృతం, పప్పు, పాలు, బియ్యం, స్నాక్స్‌ ఇతరత్రా ఇంటికే సరాఫరా చేశారు. బాలింతలు, గర్భిణులకు గుడ్లు, బియ్యం, నూనె, ప ప్పు పాలు నెలవారీగా పంపిణీ చేస్తున్నారు. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ప్రత్యక్ష బోధనకు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒకటో తేదినుంచి పూర్తిస్థాయిలో సరుకులు సెంటర్లకు చేరుతా యి. కొనుగోలు కోసం సెంటర్‌ ఖాతాలో స్పెషల్‌ ఫం డ్‌ నుంచి రూ.500 జమ చేయనున్నారు. ఇప్పటికే మెడికల్‌ కిట్స్‌, ఇతర సామగ్రి సరాఫరా చేశారు.

పిల్లల ఆరోగ్యంపై దృష్టి

ఈ నెల 26 నుంచి గ్రామపంచాయతీ సిబ్బంది అంగన్‌వాడీ సెంటర్లను శుభ్రం చేస్తున్నారు. స్టాక్‌ నిల్వలు, కావాల్సిన సరుకులు వివరాలు, ప్రాజెక్ట్‌, సెక్టర్‌ సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లలు సెంటర్లకు వచ్చేలా అంగన్‌వాడీ టీచర్లు ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పిస్తున్నారు. వచ్చెనెల ఒకటో తేదినుం చి పోషకాహర మాసోత్సవాలు చేపట్టాలి. కేంద్రాలు ప్రారంభం కాగానే పిల్లలు మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించేలా చూడాలి. ప్రతిరోజు నాలుగుసార్లు సబ్బుతో పిల్లల చేతులు శుభ్రం చేసుకునేలా చూడాలి. న్యూట్రిగార్డెన్స్‌పై దృష్టి పెట్టాలి.

ఏర్పాట్లు చేస్తున్నాం

అంగన్‌వాడీ సెంటర్లను సిద్ధం చేస్తున్నాం. ప్రత్యేక తరగతుల నేపథ్యలో చిన్నారులకు కోసం అన్ని ఏర్పా ట్లు చేశాం. ప్రతీ సెంటర్‌ ఖాతాలో స్పెషల్‌ ఫండ్‌ నుంచి రూ.500 జమవుతున్నాయి. వచ్చె నెల ఒకటి నుంచి అన్ని కార్యక్రమాలు ప్రారంభవుతాయి. కేం ద్రాలకు సరుకులు సరాఫరా చేస్తున్నాం.

- సరస్వతి, ఐసీడీఎస్‌ పీడీ, కామారెడ్డి

Updated Date - 2021-08-28T05:14:31+05:30 IST