కొత్తజోన్‌లకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు

ABN , First Publish Date - 2021-12-25T05:45:53+05:30 IST

కొత్త జోన్‌లకు అనుగుణంగా జిల్లాకు బదిలీపై వ చ్చిన వారికి ఖాళీల ఆధారంగా పోస్టులను కేటాయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సీనియారి టీ ఆధారంగా ఆప్షన్‌లను తీసుకుని బదిలీ చేయనున్నా రు. ఈ నెలాఖరులోపు చేరేవిధంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి ఉత్తర్వులు ఇవ్వనున్నారు.

కొత్తజోన్‌లకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు

ఈ నెల 31లోపు చేరాలి
చివరివారంలో కౌన్సెలింగ్‌
సీనియారిటీ ఆధారంగా కేటాయింపులు
అదనంగా 1100 మందికిపైగా ఉద్యోగులు
అధికారులతో కలెక్టర్‌ ప్రత్యేక సమావేశం

నిజామాబాద్‌, డిసెంబరు 24: (ఆంఽధ్రజ్యోతి ప్రతినిధి) : కొత్త జోన్‌లకు అనుగుణంగా జిల్లాకు బదిలీపై వ చ్చిన వారికి ఖాళీల ఆధారంగా పోస్టులను కేటాయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సీనియారి టీ ఆధారంగా ఆప్షన్‌లను తీసుకుని బదిలీ చేయనున్నా రు. ఈ నెలాఖరులోపు చేరేవిధంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి ఉత్తర్వులు ఇవ్వనున్నారు. కొత్త సంవత్సరం ప్రా రంభం నుంచి విధుల్లో చేరి పనులు చేసేవిధంగా ఈ ఉత్తర్వులను జారీ చేయనున్నారు. ప్రభుత్వం నుంచి వెలువడిన ఉత్తర్వులకు అనుగుణంగా కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో కలెక్టర్‌ బదిలీలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాకు కేటాయించిన వారికి పారదర్శకంగా ఉత్తర్వులు అందించాలని ఆదేశాలు ఇచ్చారు. కొత్త జోన్లకు అనుగుణంగా ఉమ్మడి నిజామాబాద్‌ పరిధిలో కేటాయింపులు చేశారు. సీనియారిటీ ఆధారంగా ఆఫీసు సబార్డినేట్‌ల నుంచి జూనియర్‌ ఆసిస్టెంట్‌ల వరకు ఈ కేటాయింపులను చేశారు. కేటాయించిన జిల్లాలో  చేరాలని ఆదేశాలు ఇవ్వడంతో ఉద్యోగులు ఆయా శాఖల హెచ్‌వోడీలకు రిపోర్టు చేశారు. ఉ మ్మడి జిల్లా పరిధిలో అన్ని శాఖల ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయులను ఈ రెండు జిల్లాలకు కేటాయించారు. జోన్‌ల ప్రాతిపదికన జిల్లాకు వచ్చిన వారిని సీనియారిటీ ఆధారంగా ఈనెలాఖరులోపు ఆప్షన్‌లు తీసుకుని కౌన్సెలింగ్‌ నిర్వహించి ఖాళీల ఆధారంగా కేటాయింపులు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జోన్‌లో భాగంగా ఉమ్మడి జిల్లాలో కేటాయింపులు చేయడంతో జిల్లాకు ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయులు 1100లకు పైగా వచ్చారు. వీరందరికీ శాఖల వారీగా సీనియారిటీని ప్రక టించనున్నారు. ఆయా శాఖల పరిధిలో ఖాళీలను నోటి పై చేయడంతోపాటు శాఖల హెడ్‌వోడీ కార్యాలయాల్లో ఉంచనున్నారు. ఈ ఖాళీలకు అనుగుణంగా సీనియారి టీ ఆధారంగా ఆప్షన్‌లను జిల్లాకు వచ్చిన ఉద్యోగుల నుంచి తీసుకుంటారు. ఈ ఆప్షన్‌ల ప్రకారం సీనియారి టీ ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి ఈ నెల 28న ఉ త్తర్వులను ఇస్తారు. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఈ నెల 31లోపు ఉద్యోగులు తమతమ స్థానాల్లో చేరాల్సి ఉంటుంది. జిల్లాలోని ఎక్కువ ఖాళీలున్న మారుమూల ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చి కేటాయింపులు చేయాలని ప్రభుత్వం కోరడంతో సీనియారిటీ ఆధారంగా ఈ కేటాయింపులను చేయనున్నారు. ఆయా శాఖలకు కేటాయించిన ఉద్యోగులకు అనుగుణంగా ఉత్తర్వులను ఇవ్వనున్నారు. ప్రభుత్వం నుంచి బదిలీపై ఆదేశాలివ్వడంతో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌లో శుక్రవారం సాయంత్రం జిల్లా అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖలకు కేటాయించిన ఉద్యోగులు, ఉన్న ఖాళీలపై చర్చించారు. నిబంధనలకు అనుగుణంగా సీనియారిటీ లిస్టులను పరిశీలించడంతోపాటు కార్యాలయాల్లో నోటీసు బోర్డులలో ప్రకటించాలని కోరారు. జోన్‌ల కేటాయింపు చేసిన విధంగానే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జిల్లాకు కేటాయించిన ఉద్యోగులకు ఆయా శాఖల పరిధిలో మండల, ఖాళీల్లో భర్తీచేయాలని కోరారు. సీనియారిటీ సమస్యలు తలెత్తకుండా ముందే అన్ని పరిశీలించి నోటీసు బోర్డులో పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 31లోపు కేటాయించిన స్థానాల్లో చేరేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు.

Updated Date - 2021-12-25T05:45:53+05:30 IST