ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

ABN , First Publish Date - 2021-05-30T06:49:12+05:30 IST

బోధన్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 2021-22 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రా రంభమైనవని కళాశాల ప్రిన్సిపల్‌ బిఎన్‌ కల్పన కుమారి అన్నారు.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

బోధన్‌రూరల్‌, మే 29: బోధన్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 2021-22 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రా రంభమైనవని కళాశాల ప్రిన్సిపల్‌ బిఎన్‌ కల్పన కుమారి అన్నారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, తెలుగు, ఇంగ్లీషు మీడియం, ఉర్దూ మీడియం కోర్సులు, సాంకేతిక విద్యలో ఈటీ, ఎలక్ర్టికల్‌ టెక్నిషియన్‌, ఈఈటీ ఎలక్ర్టానిక్స్‌, టెక్నిషియన్‌, ఎంఎల్‌టీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నా లజీ తదితర కోర్సులకు సంబంధించి అడ్మిషన్లు తీసుకుం టున్నామని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ మెమో, ఆధార్‌కార్డు, ఎంచుకున్న గ్రూపు, సెకండ్‌ లాగ్వేజీ, మీడియం తదితర వివరాలను ఫోన్‌ నెంబరు 91823 89186కు వాట్సాప్‌ చేస్తే మీ వివరాల ప్రకారం అడ్మిషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. విద్యార్థి ఇచ్చిన మొబైల్‌కు మెసేజ్‌ వస్తుందన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - 2021-05-30T06:49:12+05:30 IST