వీసీ, రిజిస్ట్రార్‌లపై చర్యలు తీసుకోవాల్సిందే!

ABN , First Publish Date - 2021-10-29T05:41:39+05:30 IST

అవినీతి అక్రమ ని యామకాలు రద్దు చే యాలని వర్సిటీ పాలక మం డలి రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ అధికారులు ఆదేశించిన్న ప్పటికీ వర్సిటీ అధికారులు నిర్లక్ష్యం వహించ డమే కాకుండా నియామకాలు చేపట్టలేద ని చెప్పడం సిగ్గుచేటని గురువారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పరిపాలన భవనం ఎదు ట కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు.

వీసీ, రిజిస్ట్రార్‌లపై చర్యలు తీసుకోవాల్సిందే!
నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘ నాయకులు


కళ్లకు గంతలు కట్టుకొని పరిపాలన భవనం ఎదుట విద్యార్థి సంఘాల నిరసన

డిచ్‌పల్లి, అక్టోబరు 28:  అవినీతి అక్రమ ని యామకాలు రద్దు చే యాలని వర్సిటీ పాలక మం డలి రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ అధికారులు ఆదేశించిన్న ప్పటికీ వర్సిటీ అధికారులు నిర్లక్ష్యం వహించ డమే కాకుండా నియామకాలు చేపట్టలేద ని చెప్పడం సిగ్గుచేటని గురువారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పరిపాలన భవనం ఎదు ట కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. గత పాలక మండలి సమావేశానికి ముందు ఒక సారి  నియామకాలు చేశాం పాలకమండలి అనుమతి ఇస్తే జీతాలు వేస్తామని చెప్పిన వీసీ, రిజిస్ర్టార్‌ మరో సారి పాలకమండలి అనుమతి లేకుంటే తీసుకున్న ఉద్యో గులను రద్దు చేస్తామని ప్రకటించిన వారి మాటలకు గందర గోళం నెలకొందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నా రు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్న వీసీ, రిజిస్ట్రార్‌ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామ న్నారు. వీసీ, రిజిస్ట్రార్‌ నియామకాలు జరగలేదంటున్నా గురు వారం కొన్ని సెక్షన్‌లలో కొత్త ఉద్యోగస్థులు పనిచేస్తున్నారని తెలి పారు. వర్సిటీలో విద్యారంగం గాడినపెట్టాలని డిమాండ్‌ చేశా రు. పాలక మండలి సభ్యులను రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం లో విద్యార్థి సంఘాల నాయకులు పిల్లి శ్రీకాంత్‌, రఘురాం, పంచరెడ్డి చరణ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎల్‌బీ రవి, లాల్‌సింగ్‌, జైత్రాం, మహేశ్‌ రెడ్డి, సంతోష్‌, సాయికృష్ణ, ప్రేమ్‌చంద్‌ పాల్గొన్నారు.
చర్యలు తీసుకోవాలి..
విశ్వవిద్యాయంలో ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా అక్రమంగా నియా మకాలు చేపట్టన వారిపై కేసులు నమోదు చేయాలని బీడీ ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి విఠల్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఆ యన వర్సిటీలో విలేకరులతో మాట్లాడారు. నోటిఫికేషన్లు ఇవ్వ కుండా దొంగ చాటున డబ్బులు తీసుకొని వీసీ ఉద్యోగాలు ఇవ్వ డం సిగ్గు చేటన్నారు. కరోనా సమయంలో విశ్వవిద్యాలయాలు బంద్‌ ఉండడంతో వీసీ రవీం దర్‌ బాధ్యత తీసుకున్న నెలలోపే బం ధువులకు, అనుచరులకు తనకు సంబంధించిన వ్యక్తులకు ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. అక్రమ నియామకాలు వెలుగులోకి రావడంతో వీసీ, రిజిస్ట్రార్‌ కలిసి తాము ఎలాంటి నియామకాలు చేపట్టలేదని తెలుపడం పాలక మండలి సభ్యులను ప్రొఫెసర్‌లను, విద్యార్థులను తప్పుదారి పట్టించడమేనన్నారు. ఉన్నత విద్యామండలి కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఆదేశాలను పక్కన పెట్టడం శోచనీయమన్నారు. కార్య క్రమంలో బీడీఎస్‌ఎఫ్‌ నాయకులు స్టాలిన్‌, ప్రవీణ్‌, భాస్కర్‌, సుదర్శన్‌, మనోజ్‌, కృష్ణ, అనిల్‌, తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత విద్యామండలి కమిషనర్‌కు ఫిర్యాదు
టీయూలో 2017 తర్వాత జరిగిన టీచింగ్‌, పార్ట్‌టైం లెక్చరర్‌, అకాడమిక్‌ కన్సల్టెంట్‌, నాన్‌టీచింగ్‌ అక్రమాలను రద్దు చేయాలని ఉన్నత విద్యామండలి కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌కు పీడీఎస్‌యూ నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు నరేందర్‌ మాట్లాడుతూ... 2017లో జరిగిన ఔట్‌ సోర్సింగ్‌ నియామకాలు రద్దు చేసిన తర్వాత అప్పటి వీసీ సాంబయ్య రిటైర్డ్‌ అయ్యే సమయంలో యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా నియామకాలు చేపట్టారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌పై జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేయాలని, అక్రమ నోటిఫికేషన్లు రద్దు చేయాలని కోరారు. వర్సిటీలో అకాడమిక్‌ వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టలన్నారు. ఇందుకు సానుకులంగా కమిషనర్‌ స్పందించారని అన్నారు. కమిషనర్‌ను కలిసిన వారిలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగేశ్వర రావు, కోశాధికారి మహేశ్‌ లు ఉన్నారు.
ఈసీలో చర్చించాలి
తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2020లో జరిగిన అక్రమ పదోన్నతులపై ఈ నెల 30న జరిగే ఈసీ సమావేశంలో చ ర్చించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాచకొండ విఘ్నేశ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం విశ్వవిద్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... వర్సిటీ అధికారులు రాజకీయలు చేయడం బాధాకరమన్నారు. అక్రమ పదోన్నతులపై విచా రణ కమిటీ వేసి విచారించాలన్నారు. వర్సిటీలో అవినీతి అరికట్టేందుకు ఈసీ కమిటీ ప్రయత్నం చేసి వర్సిటీ అభివృ ద్ధి చేయాలని సూచించారు. అక్రమాలకు తావు లేకుండా ఎ ల్జిబులిటీ, క్రైటెరీయ లేని ప్రొఫెసర్లపై చర్యలు తీసుక ోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వర్సిటీ ఉపాధ్య క్షుడు శ్రీశైలం, రాజు, తేజ, రవి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:41:39+05:30 IST