పెళ్లికి వెళ్తూ ప్రమాదానికి గురైన కుటుంబం

ABN , First Publish Date - 2021-12-20T05:27:11+05:30 IST

పెళ్లికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై చిన్నారి మృతి చెందగా తల్లిదండ్రులు గాయపడ్డ సంఘటన జిల్లా కేంద్రంలోని శాబ్దిపూర్‌ గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది.

పెళ్లికి వెళ్తూ ప్రమాదానికి గురైన కుటుంబం
ప్రమాదంలో మృతి చెందిన వైభవి

కామారెడ్డి, డిసెంబరు 19: పెళ్లికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై చిన్నారి మృతి చెందగా తల్లిదండ్రులు గాయపడ్డ సంఘటన జిల్లా కేంద్రంలోని శాబ్దిపూర్‌ గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. నిజామాబాద్‌కు చెందిన నాగరాజు, రేఖ దంపతులు ఇద్దరు, తమ కూతురు వైభవి(8)తో కలిసి సిద్దిపేటలో జరుగుతున్న పెళ్లికి బైక్‌పై వెళ్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శాబ్దిపూర్‌ శివారులో 44వ జాతీయ రహదారిపై బైక్‌ను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో చిన్నారి వైభవి అక్కడికక్కడే మృతి చెందగా తల్లిదండ్రులైన నాగరాజు, రేఖలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు దేవునిపల్లి పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.

Updated Date - 2021-12-20T05:27:11+05:30 IST