చెరువులో యువకుడి గల్లంతు
ABN , First Publish Date - 2021-12-30T06:47:27+05:30 IST
మండలంలోని అభంగపట్నా నికి చెందిన బుక సంతోష్ (24) బుధవారం చెరువులో గల్లంతయ్యాడు. జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.

నవీపేట, డిసెంబర్ 23: మండలంలోని అభంగపట్నా నికి చెందిన బుక సంతోష్ (24) బుధవారం చెరువులో గల్లంతయ్యాడు. జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం ఎర్రకుంట చెరువు వద్ద సంతోష్‌కు చెందిన ఫోన్, చెప్పులు లభించాయని గ్రామస్థులు తెలిపా రు. చెరువులో గాలించగా అతని ఆచూకీ లభించలేదు. తమకు ఫిర్యాదు రాలేదని నవీపేట పోలీసులు తెలిపారు.