జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-11-29T05:11:46+05:30 IST

ముప్కాల్‌ మండల కేం ద్రానికి చెందిన దంతల అశోక్‌(43) జీవితంపై విరక్తి చెంది ఆది వారం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య


ముప్కాల్‌ / బాల్కొండ, నవంబరు28: ముప్కాల్‌ మండల కేం ద్రానికి చెందిన దంతల అశోక్‌(43) జీవితంపై విరక్తి చెంది ఆది వారం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాల్కొండ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అశోక్‌ వృత్తిరీత్యా ముప్కాల్‌ మండల కేంద్రంలో టైలర్‌ పని చేస్తూ జీవిస్తున్నాడు. అయితే రెండు రోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నారు. దీంతో జీవితంపై వరక్తి చెంది బాల్కొండ మండలం బస్సాపూర్‌ శివారులో బర్లమంద వద్ద చింతచెట్టు కింద తన బైక్‌ను ఉంచి చీరతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యు లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు బాల్కొండ పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు.

Updated Date - 2021-11-29T05:11:46+05:30 IST