8820 ఉపాధ్యాయుల కేటాయింపు : డీఈవో

ABN , First Publish Date - 2021-12-25T05:45:17+05:30 IST

జీవో నెం. 317 ప్రకారం ఉమ్మడి జిల్లాలో 8820 ఉపాధ్యాయుల కేటాయింపు పూర్తి చేసినట్లు డీఈవో దుర్గాప్రసాద్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

8820 ఉపాధ్యాయుల కేటాయింపు : డీఈవో


నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 24 : జీవో నెం. 317 ప్రకారం ఉమ్మడి జిల్లాలో 8820 ఉపాధ్యాయుల కేటాయింపు పూర్తి చేసినట్లు డీఈవో దుర్గాప్రసాద్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాకు 4779మంది ఉపాధ్యాయులను, 4041మంది ఉపాధ్యాయులను కామారెడ్డి జిల్లాకు అన్ని రకాల కేటగిరీకి సంబంధించిన ఉపాధ్యాయులను పారదర్శకంగా, సీనియారిటీ ప్రకారం కేటాయించినట్లు డీఈవో తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా నుంచి 670మంది కామారెడ్డి జిల్లాకు, కామారెడ్డి జిల్లా నుంచి 370మంది ఉపాధ్యాయులు నిజామాబాద్‌ జిల్లాలో రిపోర్ట్‌ చేశారని తెలిపారు. నాన్‌టీచింగ్‌ సిబ్బంది జూనియర్‌ అసిస్టెంట్‌ వరకు మొత్తం 85మందిలో 68మంది నిజామాబాద్‌కు 17మందిని కామారెడ్డికి కేటాయించడామని డీఈవో తెలిపారు. ఇందులో కామారెడ్డి నుంచి నిజామాబాద్‌కు 11 మంది, నిజామాబాద్‌ నుంచి కామారెడ్డికి ఏడుగురు రిపోర్ట్‌ చేసినట్లు డీఈవో తెలిపారు.

Updated Date - 2021-12-25T05:45:17+05:30 IST