కామారెడ్డి నియోజకవర్గానికి రూ.13.70 కోట్ల నిధుల మంజూరు

ABN , First Publish Date - 2021-03-21T05:54:13+05:30 IST

కామారెడ్డి నియోజకవర్గంలో రోడ్ల పనులకై కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రూ.13.70కోట్ల నిధులను శనివారం మంజూ రు చేసినట్లు ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ తెలిపారు.

కామారెడ్డి నియోజకవర్గానికి రూ.13.70 కోట్ల నిధుల మంజూరు

 ఎన్‌ఆర్‌ఈఎస్‌జీస్‌ పథకం కింద కేటాయింపు: ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి నియోజకవర్గంలో రోడ్ల పనులకై కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రూ.13.70కోట్ల నిధులను శనివారం మంజూ రు చేసినట్లు ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ తెలిపారు. మహత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాఽధి హామీ పథకం కింద ప్రభుత్వాలు ఈ నిధులు మంజూరు చేశాయని తెలిపారు. ఈ నిధులతో నియోజకవ ర్గంలోని ఏడు మండలాల్లో సీసీ రోడ్లు వేస్తామని తెలిపారు. భిక్కనూర్‌ మండలానికి రూ.3.5 కోట్లు, రాజంపేటకు రూ.90 లక్షలు, మాచారెడ్డికి రూ.3.45 కోట్లు, రామారెడ్డికి రూ.90 లక్షలు, దోమకోండకు రూ.1.65 కోట్లు, బీబీపేటకు రూ.1.95 కోట్లు, కామా రెడ్డికి రూ.1.90 కోట్లు నిధులు మంజూరైనట్లు ప్రభుత్వ విప్‌ పేర్కోన్నారు. టెండర్లు పిలిచి సీసీ రోడ్లు వేయడం జరుగుతుందన్నారు.

Updated Date - 2021-03-21T05:54:13+05:30 IST