ప్రజావాణికి 127 వినతులు

ABN , First Publish Date - 2021-02-02T05:14:27+05:30 IST

ప్రతీ సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఈ వారం 127 వినతులు వచ్చాయి.

ప్రజావాణికి 127 వినతులు

నిజామాబాద్‌ అర్బన్‌, ఫిబ్రవరి 1: ప్రతీ సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే  ప్రజావాణి కార్యక్రమానికి ఈ వారం 127 వినతులు వచ్చాయి. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తన ఛాంబర్‌లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కలెక్టర్‌ నేరుగా 117 వినతులు స్వీకరించగా ఫోన్‌ల ద్వారా 10 వినతులను మొత్తం 127 వినతులను స్వీకరించారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌ బి.ఎస్‌.లత వినతులు స్వీకరించారు. 

కలెక్టరేట్‌ ముట్టడి

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టకుండా నెహ్రూనగర్‌ గ్రామంలో నివసించే పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని లేదా కనీసం ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు వచ్చిన వారు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్‌, నాయకులు గోవఽర్ధన్‌, గంగాధర్‌, ఫారుఖ్‌ తదితరులు ఉన్నారు. 

మున్సిపల్‌ కార్మికులను విఽధుల్లోకి తీసుకోవాలి

నిజామాబాద్‌ నగర పాలక సంస్థ పరిఽధిలో పనిచేస్తున్న కార్మికులను అక్రమంగా విధుల్లోకి తొలగించారని వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవడంతో పాటు ప్రగతి గ్రూప్‌ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు మల్యాల గోవర్ధన్‌ ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. 


Updated Date - 2021-02-02T05:14:27+05:30 IST