రైలు ఢీకొని యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-12-30T06:37:16+05:30 IST
రైలు ఢీకొని యువకుడు మృతి చెందాడు.

యాదాద్రి రూరల్, డిసెంబరు 29: రైలు ఢీకొని యువకుడు మృతి చెందాడు. రైల్వే ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని వంగపల్లి-ఆలేరు రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం ఉదయం 8గంటల ప్రాంతంలో గుర్తు తెలియని యువకుడిని రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడు. దీంతో కేసు నమోదు చేసి పోస్టుమార్టుం నిమిత్తం శవాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.