రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-12-08T06:17:04+05:30 IST

మండలంలోని తీగలచెర్వు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కరుణాకర్‌(ఫైల్‌)

మఠంపల్లి, డిసెంబరు 7 : మండలంలోని తీగలచెర్వు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అల్లీపురం గ్రామానికి చెందిన అమరావరపు కరుణాకర్‌(24) తన స్నేహితుడు శాంతకుమార్‌తో కలిసి కూరగాయలు కొనుగోలు చేసేందుకు మఠంపల్లికి బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా మఠంపల్లి నుంచి బీల్యానాయక్‌తండాకు బైక్‌పై వస్తున్న బానోతు వేలాద్రి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో కరుణాకర్‌ బైక్‌పై నుంచి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. శాంతికుమార్‌కు గాయాలయ్యాయి. కరుణాకర్‌కు తండ్రి దేవయ్య, తల్లి లక్ష్మమ్మలు ఉన్నారు. వారి సంతానంలో కరుణాకర్‌ చివరివాడు. పెద్దవారైన అన్నలు, అక్కలు పెళ్లిళ్లు అయి వెళ్లిపోగా తల్లిదండ్రుల పోషణ కరుణాకర్‌పై పడింది. పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.  తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Updated Date - 2021-12-08T06:17:04+05:30 IST