విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-05-18T07:18:42+05:30 IST

విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి
వెంకటేష్‌ (ఫైల్‌)

 ఓ మామిడితోటలో కాయలు కోయడానికి..

కోదాడరూరల్‌, మే 17: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నడి గూడెం మండలం తెల్లబెల్లి గ్రామానికి చెందిన వీరబోయిన నాగేశ్వరరావు సైదమ్మ దంపతుల పెద్ద కుమారుడు వెంక టేష్‌(20)స్నేహితులతో కోదాడ మండలం కోమరబండ గ్రామం లోని ఓ మామిడితోటలో కాయలు కోయడానికి వెళ్లాడు.  మంచినీళ్లు తాగడానికి సమీపంలోని మోటారు వద్ద వెళ్లి  విద్యుత్‌ తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేష్‌ ఎంతసేపటికీ రాకపోవడంతో స్నేహితులు వెళ్లి చూసేసరికి అప్పటికి మృతి చెంది ఉన్నాడు. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. 


Updated Date - 2021-05-18T07:18:42+05:30 IST