చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-08-21T06:32:07+05:30 IST

భువనగిరి పెద్ద చెరువులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా, పట్టణ శివారులోని యాదినేని చెరువులో మరో యువకుడు గల్లంతయ్యాడు.

చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య

మరో ఘటనలో యువకుడి గల్లంతు

భువనగిరిటౌన్‌, ఆగస్టు 20: భువనగిరి పెద్ద చెరువులో ఓ యువకుడు  ఆత్మహత్య చేసుకోగా, పట్టణ శివారులోని యాదినేని చెరువులో మరో యువకుడు గల్లంతయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ జిల్లా ఉప్పల్‌ చిలుకానగర్‌కు చెందిన జక్కి దర్శన్‌(30) ఈనెల 18న బైక్‌పై ఇంటి నుంచి బైక్‌పై  భువనగిరికి వచ్చి పెద్ద చెరువులో దూకాడు. చెరువులో ఈనెల 19న మృతదేహం తేలి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చెరువు గట్టున ఉన్న బైక్‌ ఆధారంగా మృతుడు దర్శన్‌గా  పోలీసులు గుర్తించి,  అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు దర్శన్‌ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం భువనగిరి ఆస్పత్రికి తరలించి, తదనంతరం కుటుంబ సభ్యులకు అప్ప గించారు. 

 భువనగిరి ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ఆవరణలోని      గుడిసెల్లో  నివసించే సంచార కుటుంబానికి చెందిన సయ్యద్‌ హనేషా(25) ఈనెల 19 నుంచి కనిపించడంలేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హనేషా కోసం గాలిస్తున్న కుటుంబసభ్యులకు శుక్రవారం పట్టణ శివారులోని యాదినేని చెరువు వద్ద అతడి బైకు, చెప్పులు, దుస్తులు కనిపించాయి. దీంతో చెరువులో పడి హనేషా మృతి చెంది ఉంటాడనే అను మానంతో  కుటుంబ సభ్యులు, పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలి ంపు చర్యలు చేపట్టారు.  అయితే ఈ రెండు ఘటనలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ రెండు కేసులను భువనగిరి పట్టణ పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-08-21T06:32:07+05:30 IST