ఏపీలో వైసీపీ అరాచకాలను అడ్డుకోవాలి

ABN , First Publish Date - 2021-10-21T05:56:47+05:30 IST

ఏపీలో టీడీపీపై వైసీపీ అరాచకాలు కొనసాగిస్తోం దని టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి వడ్డెబోయిన శ్రీనివాస్‌ అన్నారు.

ఏపీలో వైసీపీ అరాచకాలను అడ్డుకోవాలి

మిర్యాలగూడ టౌన్‌/ చండూరు/ మర్రిగూడ/ వేములపల్లి/ మాడ్గుల పల్లి, అక్టోబరు 20: ఏపీలో టీడీపీపై వైసీపీ అరాచకాలు కొనసాగిస్తోం దని టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి వడ్డెబోయిన శ్రీనివాస్‌ అన్నారు. ఏపీలోని పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు జిల్లా కార్యాలయాలపై వైసీపీ నాయకుల దాడిని నిరసిస్తూ పట్టణంలో బుధవారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నూకపంగు కాశయ్య, రావిరాల నాగేందర్‌, రామాంజిరెడ్డి, చిలుకల వెంకన్న, అనంతరాములు, రామ కృష్ణ, సురేష్‌ పాల్గొన్నారు. టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ఫ్లైఓవర్‌ వద్ద నిరసన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ముక్కె ర అంజిబాబుయాదవ్‌, కనకయ్య, సూర సైదులు, వెంకన్న, నాగయ్య, లక్ష్మణ్‌ పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాసుల సత్యం ఆధ్వర్యంలో బీఆర్‌ అంబేడ్కర్‌, జగ్జీవన్‌రాం విగ్రహాలకు వినతిపత్రాలు అందజే శారు. కార్యక్రమంలో జడ రాములు, జానిమియా, గంధం శ్రీను, నర్సిం హగౌడ్‌, రామాచారి, రసూల్‌, సైదానాయక్‌, వెంకన్న పాల్గొన్నారు. చండూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు నల్ల సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షుడు ఎర్ర జెల్ల లింగయ్య మాట్లాడారు. ఏపీలోని టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నాయకులు దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ యూనస్‌, మహ్మద్‌ షరీఫ్‌, నందగిరి కృష్ణ, అన్నెపర్తి మల్లేశం, మొగుదాల పాండు, గంట ఆం జనేయులు, తోకలి యాదయ్య, రాము పాల్గొన్నారు. టీడీపీ కార్యా లయాలపై జరుగుతున్న దాడులను రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి ముద్దం శ్రీనివాస్‌ ఖండించారు.  స్థానిక విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో కుప్పాల యాదయ్య, ఎండి.షర్బుద్దిన్‌, చాపల వెంక టయ్య, అంజయ్య పాల్గొన్నారు. వేములపల్లిలో జరిగిన సమావేశంలో టీడీపీ జిల్లా పార్లమెంటరీ కార్యదర్శి జడ రాములుయాదవ్‌ మా ట్లాడారు. ఏపీలో ప్రతిపక్ష నాయకులపై పోలీసుల సమక్షంలోనే దాడు లు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో అధికార యంత్రాంగం పూ ర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో ఎండీ.జానిమియా, షేక్‌ రసూ ల్‌, సైదులు, మల్లేష్‌, నాగయ్య, వెంకన్న పాల్గొన్నారు. మాడ్గులపల్లిలో జరిగిన సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు షేక్‌ రసూల్‌ మాట్లాడారు. ఏపీలో మారకద్రవ్యాల అమ్మకాలు సాగుతుంటే అరి క ట్టాల్సిన ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడఏమిటని ప్రశ్ని ంచారు. కార్యక్రమంలో అనంతరెడ్డి, చంద్రయ్య, అంజయ్య ఉన్నారు.

Updated Date - 2021-10-21T05:56:47+05:30 IST