యాదగిరిగుట్ట రూరల్‌ సీఐ నర్సయ్య సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-10-29T06:05:03+05:30 IST

యాదాద్రి భువ నగిరి జిల్లా యాదగిరిగుట్ట రూరల్‌ సీఐ నర్సయ్యను రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌భగవత్‌ సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భూ వివాదాల్లో తలదూర్చడంతో పాటు విఽధి నిర్వహణలో అల

యాదగిరిగుట్ట రూరల్‌ సీఐ నర్సయ్య సస్పెన్షన్‌

యాదాద్రిరూరల్‌, అక్టోబరు 28: యాదాద్రి భువ నగిరి జిల్లా యాదగిరిగుట్ట రూరల్‌  సీఐ నర్సయ్యను రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌భగవత్‌ సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భూ వివాదాల్లో తలదూర్చడంతో పాటు విఽధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. కిందిస్థాయి ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు సస్పెన్షన్‌ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఐ నర్సయ్య స్థానంలో ఎల్‌బీనగర్‌ సీసీఎ్‌సలో ఇన్‌స్పెక్టర్‌గా  పని చేస్తున్న నవీన్‌రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  


Updated Date - 2021-10-29T06:05:03+05:30 IST