Yadadri: సాయిదామమ్ ఆశ్రమం స్వామీజీ అరెస్ట్

ABN , First Publish Date - 2021-12-31T16:26:37+05:30 IST

జిల్లాలోని బొమ్మల రామారం పెద్దపర్వతాపూర్ సమీపంలోని శ్రీ సాయి దామమ్ ఆశ్రమం స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు.

Yadadri: సాయిదామమ్ ఆశ్రమం స్వామీజీ అరెస్ట్

యాదాద్రి-భువనగిరి: జిల్లాలోని బొమ్మల రామారం పెద్దపర్వతాపూర్ సమీపంలోని శ్రీ సాయి దామమ్ ఆశ్రమం స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్రమం నిర్వాహకుడు రామనంద ప్రభుజీ తనపై  అత్యాచారానికి పాల్పడినట్లు ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అర్ధరాత్రి స్వామిజీని అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ శిశు విహార్ నుంచి సాయి దామంకు వచ్చిన బాలిక 2018 వరకు ఆశ్రమంలోనే జీవనం సాగించింది. 2018 వేధింపుల తర్వాత హైదరాబాద్ అమీర్‌పేట్ స్టేట్ హోమ్‌కు తరలించారు. స్వామీజీపై ఐదు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సాయి దామం ఆశ్రమ భూమి కబ్జాకు ఓ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అడ్డుపడుతున్నందుకే స్వామీజీపై ఓ మహిళ ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2021-12-31T16:26:37+05:30 IST