యాదాద్రిలో భక్తుడిని చితకబాదిన పోలీసులు

ABN , First Publish Date - 2021-10-19T17:33:16+05:30 IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తుడిని పోలీసులు చితకబాదారు. దెబ్బలు తాళలేక భక్తుడు మృతి చెందాడు.

యాదాద్రిలో భక్తుడిని చితకబాదిన పోలీసులు

యాదాద్రి-భువనగిరి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తుడిని పోలీసులు చితకబాదారు.  దెబ్బలు తాళలేక భక్తుడు మృతి చెందాడు. మృతుడు మహబూబ్‌నగర్ అటవీశాఖ కౌంటర్ అసిస్టెంట్ కార్తీక్‌గా గుర్తించారు. కార్తీక్ ఆదివారం లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు యాదాద్రికి వచ్చాడు. కాగా అనుమానస్పదంగా కనిపించడంతో పోలీసులు గాయపర్చారని బంధువులు ఆరోపిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో మార్గం మధ్యలో కార్తీక్ మృతి చెందాడు. 

Updated Date - 2021-10-19T17:33:16+05:30 IST