గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీనా

ABN , First Publish Date - 2021-11-26T06:44:44+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు గల్లీలో కుస్తీ పడుతూ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు చేపట్టాలని గురువారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తంచేసి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు బాధ్యతను మాది కాదంటే మాది కాదంటూ రైతుల ను ఆయోమయానికి గురిచేస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయన్నారు.

గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీనా
కలెక్టరేట్‌ ఎదుట నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, చెవిటి వెంకన్న తదితరులు

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి 


సూర్యాపేటటౌన్‌, నవంబరు 25: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు గల్లీలో కుస్తీ పడుతూ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు.  ధాన్యం కొనుగోలు చేపట్టాలని గురువారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తంచేసి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు బాధ్యతను మాది కాదంటే మాది కాదంటూ రైతుల ను ఆయోమయానికి గురిచేస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర జా బితాలో వివిధ పంటలతోపాటు వరి పంట కూడా ఉందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలన్నారు. పంట కల్లాలకు వచ్చి నెల రోజు లు కావస్తున్నా, నేటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా పం ట కొనక పోవడం దారుణమన్నారు. కల్లాల్లోనే ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తేమసాకుతో ధాన్యం కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అన్నివర్గాలు వివక్షకు గురయ్యాయన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామ న్న సీఎం కేసీఆర్‌ ఏ ఒక్క కుటుంబాన్నైనా ఆదుకున్నారా అని ప్రశ్నించారు. ఉపఎన్నిక సందర్భంగా ప్రవేశపెట్టిన దళితబం ధు పథకం ఎందుకు అమలు చేయడంలేదన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌కు ర్యాలీగా చేరుకొని అదనపు కలెక్టర్‌ మోహన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీసీ సీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, సంధ్యారెడ్డి, కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్‌, కోతి గోపాల్‌రెడ్డి, తూముల సురే్‌షరావు, నాగిరెడ్డి, రమేష్‌, కక్కిరేణి శ్రీనివాస్‌, బైరు శైలేందర్‌గౌడ్‌, విక్రమ్‌, వేణుగోపాల్‌, నెల్లుట్ల లింగస్వామి పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-26T06:44:44+05:30 IST