కార్మికులను ఈ- శ్రామ్‌లో చేర్పించాలి

ABN , First Publish Date - 2021-11-23T06:13:53+05:30 IST

అర్హులైన అసంఘటిత రంగ కార్మికులను గుర్తించి ఈ- శ్రామ్‌ పోర్టల్‌లో ఉచిత నమోదు ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్‌ పమేలా సత్పథి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సోమవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తమ శాఖల్లో అర్హులైన అసంఘటిత కార్మికు లు ఎంత మంది ఉన్నారో అధికారులు గుర్తించి వారందరి పేర్లను ఈ- శ్రామ్‌ పోర్టల్‌లో న

కార్మికులను ఈ- శ్రామ్‌లో చేర్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలా సత్పథి

కలెక్టర్‌ పమేలా సత్పథి

భువనగిరి రూరల్‌, నవంబరు 22: అర్హులైన అసంఘటిత రంగ కార్మికులను గుర్తించి ఈ- శ్రామ్‌ పోర్టల్‌లో ఉచిత నమోదు ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్‌ పమేలా సత్పథి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సోమవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తమ శాఖల్లో అర్హులైన అసంఘటిత కార్మికు లు ఎంత మంది ఉన్నారో అధికారులు గుర్తించి వారందరి పేర్లను ఈ- శ్రామ్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. వారందరికీ సామాజిక భద్రత, వివిధ సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ- శ్రామ్‌ పథకంలో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికీ కేంద్ర ప్రభుత్వం సంవత్సరం పాటు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2లక్షల ప్రమాద బీమా వర్తింపజేస్తుందన్నారు. కార్మిక శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు 5,862మంది కార్మికుల పేర్లు పోర్టల్‌లో నమోదయ్యాయని తెలిపారు. 16నుంచి 59సంవత్సరాల వయ స్సు లోపు వారు మాత్రమే ఈ పథకానికి అర్హులన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు డి. శ్రీనివాస్‌రెడ్డి, దీపక్‌ తివారీ, డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌రెడ్డి, డీఎంఅండ్‌ హెచ్‌వో డాక్టర్‌ సాంబశివరావు, డీపీవో సునంద, డీఏవో కె అనురాధ, ఐసీడీఎస్‌ పీడీ కేవీ కృష్ణవేణి, బీసీ, ఎస్టీ, కార్మిక సంక్షేమ శాఖ అధికారులు యాదయ్య, మంగ్తానాయక్‌, బాల్యా నాయక్‌, మునిసిపల్‌ కమిషనర్‌ పూర్ణచందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-23T06:13:53+05:30 IST