క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-25T07:00:20+05:30 IST

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ క్రి మిసంహారక మదు తాగి ఆత్మహత్య చేసుకుంది.

క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్య

నల్లగొండ క్రైం, డిసెంబరు 24: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ క్రి మిసంహారక మదు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. పట్టణంలోని గొల్లగూడకు చెందిన ఆవుల ముత్తమ్మ(48) ఎనిమిదేళ్లుగా టీబీ వ్యాధితో బాధపడుతుంది. నాటి నుంచి ఎన్ని మందులు వాడినా వైద్యచికిత్సలు చే యించుకున్నా వ్యాధి తగ్గకపోవడంతో మనస్థాపానికి గురైంది. గురువారం మధ్యా హ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నా నికి పాల్పడింది. గమనించిన చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తర లించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మృతురాలి కుమారుడు ఆవు ల యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన క్రైం ఎస్‌ఐ యాదగిరి తెలిపారు. 

 

Updated Date - 2021-12-25T07:00:20+05:30 IST