అందరికీ విజయాలు చేకూరాలి

ABN , First Publish Date - 2021-10-15T05:19:53+05:30 IST

అందరికీ విజయాలు చేకూరాలని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి ఆకాంక్షించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు.

అందరికీ విజయాలు చేకూరాలి
దుర్గాదేవి విగ్రహం వద్ద పూజలు చేస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

 జిల్లా ప్రజలకు మంత్రి జగదీష్‌రెడ్డి  దసరా పండుగ శుభాకాంక్షలు

 సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష

నల్లగొండ రూరల్‌, అక్టోబరు 14: అందరికీ విజయాలు చేకూరాలని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి ఆకాంక్షించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి అంటేనే చెడుపై మంచి గెలిచిన రోజు అని, అటువంటి రోజు ప్రజలకు స్ఫూర్తి కావాలని ఆయన అన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలన్నారు. అందివచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిరంతరం ఉచిత విద్యుత్‌, సమృద్ధిగా నీటితో పచ్చని మాగాణంతో ధాన్యపు సిరులు పండాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు. 

Updated Date - 2021-10-15T05:19:53+05:30 IST