ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఖాయం : యెన్నం

ABN , First Publish Date - 2021-02-07T05:05:20+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఖాయం : యెన్నం
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌రెడ్డి

రామగిరి, ఫిబ్రవరి 6 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌ బూత్‌ కన్వీనర్‌ వర్క్‌పా్‌పలో పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ బీజే పీ పరంపర మొదలైందని, కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు గెలుపునకు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌ పోలిం గ్‌ బూత్‌ కన్వీనర్లకు వర్క్‌షాప్‌ నిర్వహించారు. మండలాలు, పట్టణాల వారీగా సమావేశాలు నిర్వహించి పని విభజన చేసి ఓటర్లను కలవాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివా్‌సగౌడ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రజినీకుమారి, నూకల నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-02-07T05:05:20+05:30 IST