ప్లాస్టిక్ వినియోగానికి తెరపడేనా?
ABN , First Publish Date - 2021-10-25T06:20:27+05:30 IST
ను ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్‌ను నిషేధించడానికి మునిసిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం ఉండడంలేదు. దీంతో

జిల్లాలో ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు
మునిసిపాటీల్లో కవర్ల వాడకంపై జరిమానాలు
నియంత్రణకు ఫిర్యాదుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు
పర్యావరణానికి పెను ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్‌ను నిషేధించడానికి మునిసిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం ఉండడంలేదు. దీంతో ప్లాస్టిక్ నిర్మూలనకు మునిసిపాలిటీల్లో కఠిన చర్యలు తీవ్రమయ్యాయి. 75మైక్రాన్‌ల లోపు ఉన్న ప్లాస్టిక్ గ్లాసులు, బ్యాగులు ఉపయోగిస్తే జరిమానా విధించడానికి సిద్ధమవుతు న్నారు. సూర్యాపేట మునిసిపాలిటీలోనే ఇప్పటి వరకు రూ.3లక్షల వరకు జరిమానా విధించారు. కరోనా తర్వాత ప్లాస్టిక్ నియ ంత్రణపై అంతంతమాత్రంగానే దాడులు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మునిసిపాలిటీల్లో సైతం రూ.4లక్షల దాకా జరిమానా విధించారు. భూమిలో కరగని ప్లాస్టిక్ వినియోగం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. ఆవులు, గేదెలు, మేకలు కూడా ప్లాస్టిక్‌ను తిని అనారోగ్య పాలవుతున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌లో అనేక పశువులు ఉదయం పూట కూరగాయలతో పాటు ప్లాస్టిక్‌ను తిని తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నాయి. వివాహాలు, పుట్టిన రోజు వేడుకలు, వివిధ శుభకార్యాలకు ప్లాస్టిక్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వీటిపై కూడా నియంత్రణ అంతంతే.
- సూర్యాపేట టౌన్
గతంలో పట్టణాల్లో మాత్రమే ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండే ది. ఇప్పుడు పల్లెల్లో కూడా టీ దుకాణాలు, పండ్ల బండ్ల వారు, కిరాణ దుకాణదారులు కూడా ప్లాస్టిక్ సంచులను వినియోగదారులకు ఇసు ్తన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. మనం పీల్చే గాలిలో కూడా మైక్రో ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయని ఇటీవల పరిశోధనలో తేలింది. ప్లాస్టిక్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేదించింది. ఒకసారి వాడి పారేసే (సింగిల్ యూజ్డ్) ప్లాస్టిక్ సంచులు, గ్లాస్లులు, స్టాళ్లపై నిషేదం అమలుకానుంది. ప్రధాని స్వచ్ఛత హీ సేవా కార్యక్రమా న్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో అనేక మంది దుకాణదారులు నేటికి 75మైక్రాన్‌ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్నారు.
తూతూ మంత్రంగా చర్యలు
ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడానికి తీసు కుంటున్న చర్యలు అంతంత మాత్రంగా ఉన్నాయి. కరోనాకు ముందు సూర్యాపేటలో రూ.19 వేలు, కోదాడలో రూ.10 వేలు, హుజూర్‌నగర్‌లో రూ. 2వేలు, తిరుమలగిరిలో రూ.3 వేల వరకు జరిమానా విధించినట్లు సమాచారం. గతంలో 50మైక్రాన్ల కన్న తక్కువ ఉండే వాటిపై నిషేదం ఉండగా ప్రస్తుతానికి 75 మైక్రాన్లలో పు ప్లాస్టిక్‌ను నిషేదించారు. ముఖ్యంగా ఇయర్స్‌బర్డ్ ప్లాస్టిక్ జెండా లు, ఐస్ క్రీం పుల్లలు, ప్లాస్టిక్ చెంచాలు, స్వీట్ బాక్సులు, ప్లాస్టిక్ ప్లేట్లతో పాటు బ్యానర్లు, బెలూన్లకు కట్టే ప్లాస్టిక్ స్టిక్స్ వంటి వాటిని నిషేధిస్తే ప్లాస్టిక్ పూర్తిగా నివారణ అయ్యే అవకాశం ఉంటుంది.
జిల్లాలో భారీగా ప్లాస్టిక్ వినియోగం
జిల్లాలో ప్రతిరోజూ సుమారు 45టన్నుల ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నట్లు సమాచారం. 75మైక్రాన్లలోపు ఉన్న ప్లాస్టిక్ కవర్లు వందల సంవత్సరాలు ఉన్నా భూమిలో కరగవు. పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ జీవో నంబర్ 571(3) ను ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ 2016ను సవరిస్తూ 75 మైక్రాన్లకంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్‌ను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తె లుస్తోంది. దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేయడానికి హెల్ప్‌లైన్ నంబర్ 9908487165 సూ ర్యాపేట మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది.
ప్లాస్టిక్ సంచులను వినియోగిస్తే జరిమానా
75మైక్రాన్లలోపు బరువు కలిగిన ప్లాస్టిక్ సంచులు, గ్లాస్లు ను వినియోగిస్తే జరిమానా విధిస్తాం. ప్లాస్టిక్ నిషేదాన్ని స్వచ్చంధంగా ప్రతి ఒక్కరూ పాటించాలి. జీవో 571(3) ను ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ 2016 ను సవరి స్తూ 75మైక్రాన్లకంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్‌ను వినియోగి స్తే కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చే యడానికి హెల్ప్‌లైన్ నంబర్ 9908487165కు సమాచారం ఇవ్వాలి.
- రామాంజులరెడ్డి, సూర్యాపేట మునిసిపల్ కమిషనర్