ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతా

ABN , First Publish Date - 2021-08-20T06:42:52+05:30 IST

ఇకనుంచి సూర్యాపేట, తుంగతుర్తిలో నే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడు తానని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు. మండలం లో ని రాయినిగూడెం స్టేజీ వద్ద

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతా
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న అద్దంకి దయాకర్‌

సూర్యాపేట, తుంగతుర్తిలోనే ఉంటా

టీఆర్‌ఎస్‌ నాయకుల భూ దందాలను బయటపెడతా

టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌

సూర్యాపేటరూరల్‌, ఆగస్టు 19: ఇకనుంచి సూర్యాపేట, తుంగతుర్తిలో నే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడు తానని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు. మండలం లో ని రాయినిగూడెం స్టేజీ వద్ద గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట, తుంగతుర్తిలోని కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న విభేదాలను త్వరలో సరి చేసుకొని రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు పనిచేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ వేరే పార్టీలకు పని చేసే కోవర్టులు బయటకు వెళ్తే మంచిదని హితవు పలికారు. 2023లో సూర్యాపేట జిల్లాలోని నా లుగు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుదన్నారు. ఎమ్మెల్యే గాద రి కిషోర్‌, టీఆర్‌ఎస్‌నాయకులు చేసే ఇసుక, భూ దందాలను త్వరలో బయ ట పెడతామన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ కార్యకర్తలపె దాడులు చేసే సంస్కృతిని మానుకోవాలని హితవుపలికారు. ప్రజాస్వా మ్యయుతంగా రాజకీయాలు చేయాలి తప్ప, కక్ష పూరిత రాజకీయలు చేయడం మంచిది కా దన్నారు. ‘మంత్రి జగదీష్‌రెడ్డి కొందరికి మంత్రినా.. లేక అందరికీ మంత్రినా’ అని ప్రశ్నించారు. ప్రతి పక్షాలు అధికార పార్టీని ప్రశ్నిస్తే కేసులు పెట్టి దాడు లు చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్య ర్థులను ఈసారి ముందుగానే ప్రకటిస్తుందని, 2023 లో అధికారంలోకి రావ డం ఖాయమన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఆదివాసిల ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్‌, నాయకులు పిండిగ విజయ్‌, అనుములపురి శ్రీనివాస్‌, యాదగిరి నిద్ర సంపత్‌, లక్ష్మణ్‌. సృజన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-20T06:42:52+05:30 IST